తెలంగాణలో మరో నోటిఫికేషన్: 581 పోస్టుల కోసం అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. తాజాగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో 581 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేడ్-1, గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మ్యాట్రన్, వార్డెన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనుంది.
జనవరి 6వ తేదీ నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

పోస్టుల వివరాలు:
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1(ట్రైబల్ వెల్ఫేర్) -05
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2(ట్రైబల్ వెల్ఫేర్) - 106
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 మహిళలు (ఎస్సీ డెవలప్‌మెంట్) -70
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవలప్‌మెంట్) - 228
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) - 140
వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ - 05
మ్యాట్రన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ - 03
వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ - 03
మ్యాట్రన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ - 02
లేడి సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవపల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ - 19.












Click it and Unblock the Notifications