Mega Job Mela: హైదరాబాద్ లో ఆగస్ట్ 31న మెగా జాబ్ మేళా..!

నిరుద్యోగులకు శుభవార్త. ఆగస్ట్ 31న హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా జరగనుంది. మాసబ్ ట్యాంక్ ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ మేళాలో అనేక కంపెనీలు పాల్గొని ఉద్యోగులను తీసుకుంటాయని వారు చెబుతున్నారు.ఫార్మా, హెల్త్, ఐటీ, ఐటీ సంస్థలు, విద్య, బ్యాంకులు తదితర విభాగాల్లో ఉద్యోగాల రిక్రూట్ మెంట్ ఉంటుందని తెలిపారు. ఈ జాబ్ మేళాలో కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌లను కూడా అందిస్తాయని వివరించారు.

పదో తరగతి ఆపైన చదివినవారు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. వాక్ ఇన్ పద్దతిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జాబ్ మేళాలో పాల్గొనడానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. పూర్తి వివరాల కోసం 8374315052 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. అయితే రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ జాబ్ మేళాకు భారీగా స్పందన వచ్చే అవకాశం ఉంది.

A mega job fair will be held in Hyderabad on August 31

ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. పోలీసు బందోబస్తు తో పాటు తాగునీటి సౌకర్యం కూడా కల్పించాల్సి ఉంటుంది. గతంలో కొన్ని చోట్ల నిర్వహించిన జాబ్ మేళా తొక్కిసలాటకు కారణమైంది. కొద్ది రోజుల క్రితం గుజరాత్ రాష్ట్రంలోని భారుచ్ జిల్లా అంకాళేశ్వర్ సిటీలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగ ప్రక్రియ చేపట్టారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలిరావడంతో జ‌రిగిన తొక్కిసలాట జరిగింది.

ఆ తర్వాత ముంబైలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ముంబైలో ఎయిర్‌ ఇండియా రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌కు పెద్ద ఎత్తున నిరుద్యోగుల రావడంతో అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. ఎయిర్‌పోర్ట్ లోడర్ల కోసం ఎయిర్ ఇండియా వాకిన్ ఇంటర్వ్యూ నిర్వ‌హించిగా.. మొత్తం 2 వేలకు పైగా పోస్టుల కోసం జరిగిన నియమాకాలకు 25 వేల మందికి పైగా నిరుద్యోగులు వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+