UIDAI Data Hackathon 2026 : ఈ ఛాన్స్ మళ్లీ రాదు. అప్లై చేయండి లక్షలు గెలవండి
దేశవ్యాప్తంగా డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధ్వర్యంలో 'ఆధార్ డేటా హ్యాకథాన్ 2026' (UIDAI Data Hackathon 2026 ) నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ హ్యాకథాన్‌కు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) సహకారం అందిస్తోంది. ఈ హ్యాకథాన్ లో మీరు గెలిస్తే ఏకంగా మీరు లక్షాధికారులు కావచ్చు.
ఆధార్ డేటా హ్యాకథాన్ 2026 లో భాగంగా విద్యార్థులు ఆధార్‌కు సంబంధించిన అజ్ఞాతీకరించిన (Anonymised) డేటా సెట్‌లను విశ్లేషించి, ఉపయోగకరమైన డేటా ఇన్‌సైట్స్, ట్రెండ్‌లు, భవిష్యత్తు అంచనాలు రూపొందించాల్సి ఉంటుంది. ఆధార్ సేవల నాణ్యతను మెరుగుపరిచేలా వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు ప్రతిపాదించడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యమని UIDAI అధికారులు తెలిపారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ఆధార్ ను పూర్తిగా అప్ డేట్ చేసి.. ఏఐ ను ఉపయోగించి భవిష్యత్తు తరాల కోసం ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందో జెన్ జీ నుంచే తెలుసుకునే వినూత్న ప్రయోగం. దీని ద్వారా రానున్న తరాలకు ఆధార్ ను వారు కోరుకున్న విధంగా అందించడంతో పాటుగా.. ఆధార్ లో లోపాలను తొలగించి, సైబర్ సెక్యూరిటీని జత చేసి.. ఎవరూ డేటా ను హ్యాక్ చేయలేని స్థాయికి తీసుకెళ్లడం
అర్హతలు - ఎవరు పాల్గొనవచ్చు ?
దేశంలోని ఏ గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతున్న 18 ఏళ్లు నిండిన విద్యార్థులు ఈ హ్యాకథాన్‌లో పాల్గొనవచ్చు. వ్యక్తిగతంగా లేదా గరిష్ఠంగా ఐదుగురు సభ్యులతో కూడిన బృందంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే UIDAI, NICలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ పోటీలో పాల్గొనే అర్హత ఉండదని స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్, సమర్పణ విధానం
నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. నిర్ణీత గడువు లోపు డేటా విశ్లేషణ నివేదికలు, విజువలైజేషన్లు, కోడ్, మోడల్ వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన బృందాలకు తదుపరి దశలో ప్రెజెంటేషన్ అవకాశం కల్పించనున్నారు.
బహుమతులు
హ్యాకథాన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 5 బృందాలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. ప్రథమ బహుమతి: రూ.2 లక్షలు, ద్వితీయ బహుమతి: రూ.1.5 లక్షలు, తృతీయ బహుమతి: రూ. 75 వేలు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన వారికి ప్రత్యేక నగదు పురస్కారాలు అందజేస్తారు.
యువతకు ఉపయోగం
ఈ హ్యాకథాన్ ద్వారా విద్యార్థులకు రియల్ టైమ్ ప్రభుత్వ డేటాతో పని చేసే అనుభవం, AI-ML, డేటా సైన్స్ నైపుణ్యాల పెంపు, అలాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రిజిస్ట్రేషన్ లింక్ : https://event.data.gov.in/challenge/uidai-data-hackathon-2026/
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications