Accentureలో ఉద్యోగాలు: బీకాం చేశారా.. అయితే ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి జీతంతో జాబ్..!!
న్యూఢిల్లీ: బీకాం చేశారా.. బీకాం చేసి సాఫ్ట్‌వేర్ కంపెనీలో స్థిరపడాలనే ఆలోచన మీకుందా.. ఇంకా ఉద్యోగ వేటలో ఉన్నారా... అయితే ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ యాక్సెంచర్ బీకాం చేసిన నిరుద్యోగుల కోసం ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా అనలిస్టు మరియు అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అనలిస్టు మరియు అసోసియేట్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. అనలిస్టు మరియు అసోసియేట్ పోస్టుల భర్తీకోసం ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులన్నీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటాయి. ఈ పోస్టుల కోసం కామర్స్ గ్రాడ్యుయేట్స్ మరియు నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు అర్హులు. ఇక యాక్సెంచర్‌లో ఉద్యోగాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే...

యాక్సెంచర్‌లో అనలిస్టు మరియు అసోసియేట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల కాగా ఆ పోస్టులకు అప్లయ్ చేయాలంటే ముందుగా యాక్సెంచర్ అధికారిక వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించాలి. ఆ అధికారిక వెబ్‌సైట్ https://www.accenture.com/us-en/careers ఈ లింక్‌పై క్లిక్ చేసి పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
యాక్సెంచర్‌లో అనలిస్టు మరియు అసోసియేట్ పోస్టులకు అభ్యర్థులు ఎంపికైతే వారికి పోస్టింగ్ నోయిడా లేదా చెన్నై ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఇన్‌వాయిస్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్ మరియు అకౌంట్స్ పేయబుల్ ప్రాసెసింగ్‌లపై పనిచేస్తారు. అనలిస్టు పోస్టుకు సంబంధించి ఇన్‌వాయిస్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పే ప్రాసెసింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి.అంతేకాదు అభ్యర్థులకు ఇందులో 3-5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగానికి నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అసోసియేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు చెన్నైలో పనిచేయాల్సి ఉంటుంది. వీరు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తారు. అకౌంట్ పేయబుల్‌కు సంబంధించిన స్కిల్స్ పై పట్టు ఉండాలి. ఈ పోస్టుకు బీకాం చేసిన అభ్యర్థులు మూడేళ్ల పని అనుభవం ఉంటే అప్లయ్ చేసుకోవచ్చు. వీరు రోజూవారీగా తలెల్లే సమస్యలను కూడా పరిష్కరించాల్సి ఉంటుంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications