ఎయిమ్స్‌లో 1,383 పోస్టులకు నోటిఫికేషన్.. భారీ జీతంతో జాబ్స్ !
న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు తీపికబురు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ ఎయిమ్స్ ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో గ్రూప్-B, గ్రూప్-C కేటగిరీలలో రెగ్యులర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 1,383 ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక ఎయిమ్స్ రిక్రూట్మెంట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు డిసెంబర్ 2, 2025 తో ముగియనుంది.
ప్రతి పోస్టుకు సంబంధించి ప్రత్యేక విద్యార్హతలు నిర్ణయించారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి అర్హతలతో కూడిన అభ్యర్థులు తమకు సంబంధిత విభాగాన్ని బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. పారా మెడికల్ పోస్టులకు డిప్లొమా/డిగ్రీ తప్పనిసరి కాగా అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు కనీసం గ్రాడ్యుయేషన్‌తో పాటు పని అనుభవం అవసరం. ఎంపికలో కీలక పాత్ర పోషించే అనుభవ సర్టిఫికెట్లు సరైన విధంగా అప్‌లోడ్ చేయాలి. కొంతమంది పోస్టులకు కంప్యూటర్ నైపుణ్యం కూడా తప్పనిసరి.

మొత్తం పోస్టులు..
1383
ఖాళీల వివరాలు..
ఈ నోటిఫికేషన్‌లో నర్సింగ్, పారా మెడికల్, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, ఫార్మసీ విభాగాల్లో భర్తీ చేపట్టారు.
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 121
- అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ - 102
- ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2/టెక్నీషియన్ - 80
- జూనియర్ స్కేల్ స్టెనో (హిందీ) - 71
- టెక్నీషియన్ (రేడియాలజీ) - 105
- సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ - 121
- ఫిజియోథెరపిస్ట్/జూనియర్ ఫిజియోథెరపిస్ట్ - 46
- శానిటరీ ఇన్‌స్పెక్టర్/జీడీ - 33
- ఫార్మసిస్ట్/ఫార్మసిస్ట్ గ్రేడ్-2 - 35
- అసిస్టెంట్ డైటీషియన్ - 17
రాబోయే రోజుల్లో వివిధ యూనిట్లలో ఖాళీలు పెరిగే అవకాశం ఉండటంతో మరికొన్ని పోస్టులు కూడా చేర్చవచ్చని ఎయిమ్స్ అధికారులు సూచించారు.
వయోపరిమితి..
సాధారణంగా ఈ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి:
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు - 5 సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు - 3 సంవత్సరాలు
- పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు - 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము..
ఎయిమ్స్ ఈసారి దరఖాస్తు ఫీజులను సాధారణం కంటే కొంచెం పెంచింది:
- జనరల్/ఓబీసీ అభ్యర్థులు - ₹3,000
- ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ - ₹2,400
పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉండే అవకాశం ఉంది.
ఎంపిక విధానం..
అన్ని పోస్టులకూ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) నిర్వహించనున్నారు. ఇందులో అభ్యర్థుల సబ్జెక్ట్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, ప్రొఫెషనల్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ (అవసరమైతే) నిర్వహిస్తారు. తుది ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగానే జరుగుతుంది.
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ aiimsexams.ac.inని సందర్శించాలి. అక్కడ AIIMS CRE 2025 రిక్రూట్‌మెంట్ లింక్‌ను ఎంచుకుని, ప్రాథమిక వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ వివరాలను పొందిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, దరఖాస్తు రుసుమును చెల్లించాలి. చివరిగా, ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్ అవసరాల కోసం నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
పరీక్ష విధానం..
పరీక్ష విధానం 90 నిమిషాల వ్యవధిలో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలను కలిగి ఉంటుంది. మొత్తం 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కు తగ్గించబడుతుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 20 ప్రశ్నలు, అభ్యర్థి పోస్టుకు సంబంధించిన డొమైన్ సబ్జెక్ట్ నుండి 80 ప్రశ్నలు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ..
అర్హత మార్కుల విషయానికి వస్తే అన్‌రిజర్వ్‌డ్ (UR) ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS) అభ్యర్థులకు 40%, ఇతర వెనుకబడిన తరగతులకు (OBC) 35%, షెడ్యూల్డ్ కులాలు (SC) షెడ్యూల్డ్ తెగలు (ST) అభ్యర్థులకు 30% మార్కులు అవసరం. పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిసేబిలిటీ (PWBD) అభ్యర్థులకు కూడా 30% అర్హత మార్కులు నిర్ణయించబడ్డాయి.
అభ్యర్థులకు సూచనలు..
- ఎయిమ్స్ అధికారులు అభ్యర్థులకు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు:
- చివరి తేదీ వరకు వేచి చేయకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి
- డాక్యుమెంట్లు స్కాన్ చేసి సరిగా అప్‌లోడ్ చేయాలి
- పరీక్ష సిలబస్ త్వరలో ప్రకటించనున్నారు, అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి
- తప్పుడు లేదా అసత్య సమాచారమిస్తే దరఖాస్తు వెంటనే రద్దు చేస్తారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications