రేపే సెలక్షన్స్, అగ్నివీర్ ర్యాలీ పూర్తి షెడ్యూల్. ఈ డాక్యుమెంట్స్ మర్చిపోవద్దు!
భారత వైమానిక దళం (IAF)లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే తెలుగు రాష్ట్రాల యువతీ యువకులకు సువర్ణావకాశం లభించింది. అగ్నివీర్ వాయు పథకం కింద ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) వేదికగా ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించనున్నారు
హైదరాబాద్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ ఆలీ అందించిన సమాచారం ప్రకారం, ఈ ఎంపికలు మార్చి 9 నుంచి ప్రారంభమవుతాయి.
- మార్చి 9, 10: మహిళా అభ్యర్థులకు మాత్రమే.
- మార్చి 12, 13: ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు.
- మార్చి 15, 16: తెలంగాణ పురుష అభ్యర్థులకు.
పోటీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా నాగార్జున యూనివర్సిటీకి హాజరుకావచ్చు.

అర్హత ప్రమాణాలు..
ఈ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు అవివాహితులై ఉండాలి. వయస్సు పరంగా జూలై 2, 2005 నుంచి జనవరి 2, 2009 మధ్య జన్మించిన వారు అర్హులు. శారీరక ప్రమాణాల విషయానికి వస్తే, అభ్యర్థులు కనీసం 152 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. విద్యార్హతల విషయానికొస్తే.. ఇంటర్మీడియట్ (MPC), మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా రెండేళ్ల ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మొత్తం మార్కుల్లో కనీసం 50 శాతం, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ - పరీక్షా విధానం..
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటగా 1.6 కిలోమీటర్ల పరుగు పందెంతో పాటు ఇతర శారీరక సామర్థ్య పరీక్షలు (PFT) నిర్వహిస్తారు. ఇందులో నెగ్గిన వారికి ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది (ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు). అనంతరం అడాప్టబిలిటీ టెస్టులు.. చివరగా మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్షలు రాసే వారికి మార్చి 30 లేదా 31 తేదీల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
అభ్యర్థులు వెంట తెచ్చుకోవాల్సినవి..
ర్యాలీకి వచ్చే అభ్యర్థులు తమ వెంట విద్యార్హత పత్రాల అసలు ప్రతులు (Originals), ప్రతి సర్టిఫికేట్‌కు సంబంధించి 6 సెట్ల జిరాక్స్ కాపీలు, 10 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.. పని చేస్తున్న మెయిల్ ఐడీని సిద్ధంగా ఉంచుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే వారు రూ.550 దరఖాస్తు రుసుముతో పాటు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ర్యాలీ ద్వారా ఎంపికైన వారు భారత వైమానిక దళంలో అగ్నివీరులుగా సేవలందించే గౌరవాన్ని పొందుతారు.
నాలుగేళ్లలో రూ.23 లక్షలకు పైగా లాభం..
అగ్నివీర్‌గా నియమితులైన వారికి నాలుగేళ్ల కాలానికి జీతం, సేవనిధి కలిపి గణనీయమైన ఆర్థిక లాభం లభిస్తుంది.
- 1వ సంవత్సరం: ₹21,000 × 12 = ₹2,52,000
- 2వ సంవత్సరం: ₹23,100 × 12 = ₹2,77,200
- 3వ సంవత్సరం: ₹25,580 × 12 = ₹3,06,960
- 4వ సంవత్సరం: ₹28,000 × 12 = ₹3,36,000
నాలుగేళ్ల మొత్తం జీతం రూ. 11,72,160 లభస్తుంది. సేవనిధి (4వ సంవత్సరం ముగిసినప్పుడు) సుమారు రూ. 11,71,000 అందుతుంది. అంటే మొత్తం లాభం సుమారు రూ. 23,43,160 వరకు చేతికి అదుతుంది. ఇది యువతకు ఆర్థికంగా బలమైన ప్రారంభం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications