Agniveer Notification: ఎయిర్‍ఫోర్స్ లో అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జులై 27 నుంచి అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 17గా నిర్ణయించారు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), మెడికల్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది.
ఈ పోస్టులలో ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో నెలవారీ రూ.30,000 జీతం ఇస్తారు. రెండో సంవత్సరంలో 33000, మూడో సంవత్సరంలో 36500, నాల్గో సంవత్సరంలో 40000 రూపాయలు ఇస్తారు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అగ్నివీర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థి వయస్సు 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే పురుష అభ్యర్థుల ఎత్తు కనీసం 152.5 సెంటీమీటర్లు ఉండాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు కనీసం 152 సెంటీమీటర్లు ఉండాలి. అర్హతకు సంబంధించిన వివరణాత్మక సమాచారం కోసం, మీరు అధికారిక వెబ్ సైట్ చూడొచ్చు. అర్హత గల అభ్యర్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.in ద్వారా జలై 27 నుంచి ఆగస్టు 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇందుకోసం జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.250 ఫీజును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ కు ఎంపికైన అభ్యర్థికి నాలుగు సంవత్సరాల శిక్షణలో రూ.48 లక్షల వైద్య బీమా ఉంటుంది.సేవ సమయంలో, అగ్నివీర్ భారత వైమానిక దళానికి చెందిన ఆసుపత్రులు, భారత వైమానిక దళానికి చెందిన CSD క్యాంటీన్‌ల ప్రయోజనం ఉంటుంది. అగ్నివీర్లకు ఏటా 30 సెలవులు ఉంటాయి. వీటితో పాటు వైద్యుని సిఫారసు మేరకు సిక్ లీవ్స్ కూడా ఉంటాయి.












Click it and Unblock the Notifications