Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సివిల్స్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. యూపీఎస్సీ మెయిన్స్ 2024 అడ్మిట్‌కార్డులు వ‌చ్చేసాయ్‌..!

సివిల్స్ ప‌రీక్ష‌లు రాసే అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా సివిల్స్ మెయిన్స్ అడ్మిట్ కార్డు 2024ల‌ను విడుదల చేసింది. ఈ ప‌రీక్ష‌లకు హాజరయ్యే అభ్యర్థులు సివిల్స్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి upsc.gov.in త‌మ అడ్మిట్‌కార్డుల‌ను డౌన్‌లోడ్ చేయ‌గ‌ల‌రు. అభ్య‌ర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​, upsconline.nic.in సంప్ర‌దించ‌గ‌ల‌రు. సివిల్స్ మెయిన్స్ అడ్మిట్‌కార్డులు సెప్టెంబర్ 29 వరకు అందుబాటులో ఉంటాయ‌ని అధికారులు తెలిపారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్​ పరీక్షలు సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ప‌రీక్ష‌లు రెండు షిఫ్టుల్లో జ‌ర‌గ‌నున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జ‌ర‌గ‌గా, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వ‌హిస్తారు.

యూపీఎస్సీ 1056 పోస్టుల భ‌ర్తీకి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వీటికి ద‌రఖాస్తు ప్ర‌క్రియ ఫిబ్ర‌వ‌రి 14వ తేదిన ప్రారంభ‌మ‌య్యి, మార్చి 5వ తేదిన ముగిసింది. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 16, 2024 న నిర్వహించారు. వీటి ఫ‌లితాల‌ను జూలై 1, 2024 విడుద‌ల చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల‌ను మాత్ర‌మే మెయిన్స్​ పరీక్షకు అర్హ‌త సాధిస్తారు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్​ ఎగ్జామినేషన్​లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌లు నిర్వ‌హిస్తారు. రాత పరీక్షలో తొమ్మిది సంప్రదాయ వ్యాస పత్రాలు ఉంటాయి. వీటిలో రెండు అర్హత ప‌రీక్ష‌లు.. వివిధ సర్వీసులు, పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ పరీక్ష‌ల‌ను నిర్వహిస్తారు.

Alert for civil candidates UPSC Mains 2024 admit cards Released

మెయిన్స్ అడ్మిట్ కార్డ్ డౌన్​లోడ్​ చేసుకునే విధానం..

అభ్య‌ర్థులు ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను upsc.gov.in సంప్ర‌దించాల్సి ఉంటుంది. అనంత‌రం
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2024 లింక్​పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఆ త‌ర్వాత అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వెంట‌నే ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అక్క‌డ స‌బ్‌మిట్ అనే ఆఫ్ష‌న్‌పై క్లిక్ చేస్తే అడ్మిట్‌కార్డు డిస్‌ప్లే అవుతుంది.
అడ్మిట్ కార్డు చెక్ చేసుకుని మీ భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం డౌన్​లోడ్​ చేసుకోగ‌ల‌రు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+