నిరుద్యోగులకు అలర్ట్.. సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు అప్లయ్ చేయాలనుకునేవారు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు అయిదేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసేందుకు జనరల్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులయితే రూ. 100 చెల్లించాలి.
ఎంపిక విధానం : రిక్రూట్‌మెంట్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈపోస్టులకు ఎంపిక చేస్తారు. ఇతర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను https://scclmines.com/scclnew/index.asp సంప్రదించగలరు.

ముఖ్యమైన తేదీలివే..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయుటకు 15/05/2024 ప్రారంభతేదిగా నిర్ణయించడమైనది.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు 29/06/2024 చివరి తేదీగా నిర్ణయించడమైనది.
మొత్తం పోస్టుల వివరాలివే..
పోస్టుల సంఖ్య మొత్తం : 327
ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇ & ఎం), ఇ2 గ్రేడ్: 42 పోస్టులు
మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), ఇ2 గ్రేడ్: 07 పోస్టులు
నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (జేఎంఈటీ), టి & ఎస్ గ్రేడ్-సి: 100 పోస్టులు
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్), టి & ఎస్ గ్రేడ్-సి: 09 పోస్టులు
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్), టి & ఎస్ గ్రేడ్-సి: 24 పోస్టులు
ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ-I: 47 పోస్టులు
ఎలక్ట్రీషియన్ ట్రైనీ, కేటగిరీ-I: 98 పోస్టులు
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications