అభ్యర్థులకు అలర్ట్.. నీట్ పీజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల..
నీట్ అభ్యర్థులకు అలర్ట్.. నీట్ పీజీ 2024 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోగలరు. నీట్ పీజీ 2024 పరీక్ష నిజానికి జూన్ 23వ తేదీన జరగాల్సి ఉంది. అయితే, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే నీట్ పీజీ 2024 పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. యూజీసీ నెట్ 2024 పరీక్షల పేపర్ లీకేజీల క్రమంలో నీట్ పీజీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం అప్పట్లో స్పష్టం చేసింది. అయితే, ఆ తర్వాత నీట్ పీజీ 2024 కొత్త పరీక్ష తేదీలను ఎన్‌బిఇ వెల్లడించింది. నీట్ పీజీ పరీక్ష వాయిదా అయిన రెండు వారాల తర్వాత కొత్త పరీక్ష తేదీలను ప్రకటించారు. ఈ కొత్త తేదీల్లో భాగంగానే ఆగస్టు 11న నీట్ పీజీ 2024 పరీక్ష జరగనుంది. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను అధికారులు విడుదల చేశారు.
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తాజాగా, నీట్ పీజీ 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను విడుదల చేసింది. ఇక, ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగలరు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు.

2024-25 విద్యాసంవత్సరానికి గాను నీట్ పీజీ పరీక్ష ఆగస్టు 11వ తేదీన పరీక్ష జరగనున్నట్లు ఎన్‌బీఈ వెల్లడించింది. ఈ మేరక ఆగస్టు 11 నీట్ పీజీ 2024 పరీక్ష నిర్వహించాలని ఎన్‌టిఎ నిర్ణయించింది. ఈ పరీక్ష మొత్తం రెండు షిఫ్టుల్లో జరగనుంది. ఉదయం ఒక షిప్టు, మధ్యాహ్నం రెండో షిప్టు ఉంటుంది.












Click it and Unblock the Notifications