గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్... ఈ వారంలోనే మెయిన్స్ అడ్మిట్‌కార్డులు విడుదల...
ఏపీలోని గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. సెప్టెంబర్ 2 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఈ వారంలోనే విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ కమిషన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఈ ఏడాది మార్చి 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 18 జిల్లాల్లో 301 పరీక్ష కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకుంటే, వారిలో 1,26,068 మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇక, వీరిలో 91,463 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష జరిగిన 24 రోజుల వ్యవధిలోనే ఏపీపీఎస్సీ కమిషన్ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నియామక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు..
ఈ ఫలితాల్లో 1:50 చొప్పున 4,496 మంది అభ్యర్ధులు మాత్రమే మెయిన్స్ రాసేందుకు అర్హత సాధించారు. వీరితోపాటు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో ట్యాంపరింగ్, ఓఎంఆర్ షీట్‌పై బుక్‌లెట్ సీరియల్ నంబర్లు లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల 567 మంది అభ్యర్ధులు ఏపీపీఎస్సీ రిజెక్టు చేసింది. ఈ తరుణంలో వారి వివరాలను కూడా కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 2వ తేది నుంచి 9వ తేదివరకు జరగ నున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను ఈ వారంలోనే విడుదల చేసే ఏపీపీఎస్సీ ప్రణాళికలు రచిస్తోంది.












Click it and Unblock the Notifications