ఏపీలో ఉద్యోగాలు: 2,213 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, రూ. 50వేలకు పైనే జీతం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లోని పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఏపీ వైద్యారోగ్య కుటుంబం సంక్షేమ శాఖ జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. రెండు నోటిఫికేషన్ల ద్వారా 2,213 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

డిసెంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోండి
మొదటి నోటిఫికేషన్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2, ఫార్మాసిస్ట్ గ్రేడ్ -2, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, సానిటరీ అటెండర్ లాంటి పోస్టులున్నాయి. వీటిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 5 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 1317 ఖాళీల్లో ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు 839 ఉన్నాయి. 10వ తరగతితో పాటు ఫస్ట్ ఎయిడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ ఉన్నవారు రదఖాస్తు చేయవచ్చు. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైనవారికి రూ.12,000 వేతనం లభిస్తుంది. మరోవైపు, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్‌మెన్ పోస్టులు 312 ఉన్నాయి. 10వ తరగతి పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైనవారికి రూ.12,000 వేతనం లభిస్తుంది.

ఇలా దరఖాస్తు చేయండి..
ఇక ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు 17 ఉన్నాయి. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయినవారు దరఖాస్తు చేయాలి. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. రూ. 28,000 వేతనం లభిస్తుంది. ఇక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు 124 ఉన్నాయి. 10వ తరగతితో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా పాస్ కావాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. రూ.28,000 వేతనం లభిస్తుంది.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి.
అభ్యర్థులు సంబంధిత జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. మెరిట్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
Recommended Video

మరో నోటిఫికేషన్లో 896 పోస్టుల భర్తీ
ఇది ఇలావుండగా, మరో నోటిఫికేషన్ ద్వారా ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 896 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో రెగ్యులర్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ప్రభుత్వం మరిన్ని ఖాళీలను భర్తీ చేసే అలోచనలో ఉంది కాబట్టి నియామక ప్రక్రియ ముగిసే నాటికి మరిన్ని పోస్టుల జతకానున్నాయి.
మొత్తం 896 ఖాళీలు ఉండగా అందులో గైనకాలజీ- 302, పీడియాట్రిక్స్- 120, అనస్తీషియా- 118, జనరల్ మెడిసిన్- 61, జనరల్ సర్జరీ- 53, ఆర్థోపెడిక్స్- 29, పాథాలజీ- 19, ఆప్తమాలజీ- 29, రేడియాలజీ- 21, సైకియాట్రి- 8, డెర్మటాలజీ- 13, ఈఎన్‌టీ- 21, సీఎఎస్ జనరల్- 86, డీఏఎస్- 16 పోస్టులున్నాయి. ఎంపికైన వారికి రూ.53,500 వేతనం లభిస్తుంది. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల్లోగా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయండి.
విద్యార్హతలు
సీఏఎస్ జనరల్ పోస్టులకు ఎంబీబీఎస్ పాస్ కావాలి. సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ పాస్ కావాలి. డీఏఎస్ పోస్టులకు బీడీఎస్ పాస్ కావాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఏపీ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://dmeaponline.com/ సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications