ఏపీ మోడల్ స్కూల్ రిక్రూట్‌మెంట్: టీజీటీ, ఇతర పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ సొసైటీ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ సొసైటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఇతర పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.

అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cse.ap.gov.in ద్వారా పై పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ జనవరి 3, 2022 నుండి ప్రారంభించబడింది. పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 7, 2022.

Andhra Pradesh Model School Teacher Recruitment 2022: Apply For TGT, Other Posts

ఏపీ మోడల్ స్కూల్ టీచర్ రిక్రూట్‌మెంట్ గురించి మరింత తెలుసుకోవడానికి కింద తెలిపిన వివరాలను గమనించండి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జనవరి 03, 2022.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: జనవరి 07, 2022.

ఖాళీల వివరాలు:

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(PGT): 211 పోస్టులు
శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT): 71 పోస్టులు
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 282 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు.

జీతం వివరాలు:

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(PGT): ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 31,460 జీతం అందుకుంటారు.

శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT): ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 28,940 జీతం అందుకుంటారు.

ఏపీ మోడల్ స్కూల్ టీచర్ రిక్రూట్‌మెంట్ 2022: అర్హత ప్రమాణాలు

విద్యార్హత: PGT పోస్ట్ కోసం, అభ్యర్థి NCERT రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి 2 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సును పూర్తి చేసి ఉండాలి లేదా UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని సబ్జెక్టులలో మొత్తంగా కనీసం 50% మార్కులతో పూర్తి చేసి ఉండాలి:

PGT (ఇంగ్లీష్): ఆంగ్లంలో M.A.
PGT(తెలుగు): తెలుగులో M.A.
PGT (సివిక్స్): పొలిటికల్ సైన్స్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / పాలిటిక్స్‌లో M.A.

PGT (కామర్స్): M.Com. కామర్స్‌లో అకౌంటెన్సీ / కాస్ట్ అకౌంటింగ్ / ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఒక ప్రధాన సబ్జెక్ట్ / మాస్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో B.Com కలిగి ఉండాలి.

వయో పరిమతి:

పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి

ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cse.ap.gov.in ద్వారా జనవరి 7, 2022న లేదా అంతకు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత సమర్పించిన దరఖాస్తును డౌన్ లోడ్, ప్రింటౌట్ తీసుకోవాలి.

అర్హత ప్రమాణాలు, విద్యా అర్హతలు, వయోపరిమితి గురించి మరింత తెలుసుకోవడానికి, అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ సొసైటీ విడుదల చేసిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయాలని సూచించారు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(https://nadunedu.se.ap.gov.in/stms/imagepath/GOS_CIRCULARS/APMS_GUEST_TEACHER/Notification.pdf)

అప్లై చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(https://nadunedu.se.ap.gov.in/STMSWorks/Application/Guest_Registration.aspx)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+