ఏపీ ఎస్ఐ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల: ఇలా తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 19 నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 19 నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 1,51,288 మంది అభ్యర్థులు హాజరై పరీక్షలు రాయగా.. 57,923 మంది అర్హత సాధించారు. 1553 అభ్యంతరాలు స్వీకరించినట్లు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ తెలిపింది.
మార్చి 4 ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్ షీట్లు డౌన్‌లోడ్ చేసుుకునే అవకాశం కల్పించింది. రెండు పేపర్లలో అర్హత సాధించినవారికే దేహదారుఢ్య (ఫిజికల్ టెస్ట్) పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. పరీక్ష ఫలితాల కోసం https://slprb.ap.gov.in/UI/SIResults ఈ లింక్ క్లిక్ చేయండి.

411 పోస్టుల కోసం ఫిబ్రవరి 19న రాష్ట్ర వ్యాప్తంగా 291 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 1,51,288 మంది పరీక్ష రాశారు. ఇందులో 57,923 మంది అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు ఉండడగా, 8537 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా, దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications