ఇదేం సిత్రం సామీ.. గోల్డ్ షాప్‌లో కిలాడీ దొంగ! సీసీటీవీ చూసి షాకైన ఓనర్లు! (వీడియో)

కర్ణాటక రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని తుమకూరులో ఉన్న విశ్వాస్ జువెలర్స్ అనే నగల షాపులో జరిగిన ఈ వింత ఘటన వెలుగుచూసింది. షాపులోని స్టాక్ పరిశీలిస్తుండగా.. దాదాపు 10 బంగారు ఉంగరాలు, రెండు బంగారు కనిపించకుండా పోయినట్లు సిబ్బంది గుర్తించారం. సాధారణంగా దొంగతనం జరిగిందని భావించిన జువెలర్స్ షాపు యజమాని, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ క్రమంలో దొంగ ఎవరో కనిపెట్టడానికి వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

సినిమాలు కావు.. పక్కా రియల్!: దేశాన్ని వణికించిన టాప్ 5 క్రైమ్ డాక్యుమెంటరీలు!
సినిమాలు కావు.. పక్కా రియల్!: దేశాన్ని వణికించిన టాప్ 5 క్రైమ్ డాక్యుమెంటరీలు!

ఆ సీసీటీవీ పరిశీలించగా.. ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. తెల్లవారుజామున సుమారు 4.30 గంటల ప్రాంతంలో ఓ ఎలుక నగల కౌంటర్ వద్దకు వచ్చి.. బంగారు ఉంగరాన్ని తన నోటితో కరుచుకుని పారిపోతున్నట్లు రికార్డయ్యింది. అంతే కాకుండా.. పోయిన నగలన్నీ వాటి ధరల ట్యాగులతో సహా కనిపించకుండా పోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Rat Steals Gold Rings from Jewellery Shop in Karnataka A strange theft CCTV Video Viral Details

సీసీటీవీ అసలు దొంగ ఎవరో తెలిసిన వెంటనే షాపు సిబ్బంది ఆ దొంగను పట్టుకునేందుకు దుకాణమంతా వెతకడం ప్రారంభించారు. చివరకు షాపులోని ఓ మూలన ఎలుకలు చేసిన కలుగులు ఉన్నట్లు గుర్తించి.. ఆ మార్గాన్ని తవ్వి చూడగా.. కనిపించకుండా పోయిన 10 ఉంగరాలు, రెండు గొలుసులు, వాటి ధరల ట్యాగులు అన్నీ సురక్షితంగా బయటపడ్డాయి.

బంగారం ధరలు రీబౌండ్- భయపెడుతున్న పరిణామాలు
బంగారం ధరలు రీబౌండ్- భయపెడుతున్న పరిణామాలు

అన్ని ఆభరణాలు తిరిగి దొరకడంతో జువెలర్స్ యజమానితో పాటు సిబ్బంది సంతోషంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఆ కిలాడీ ఎలుకపై యాజమాన్యం పోలీసు కేసు నమోదు చేసిందో లేదో అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+