గుడ్‌న్యూస్: రేపే ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇది శుభవార్తే. ఏపీ టెట్ నోటిఫికేషన్ శుక్రవారం(జూన్ 10)న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. టెట్ ఆన్ లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం http://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో శుక్రవారం ఉదయం 10.30 నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, సిలబస్, పరీక్ష తేదీలు, పరీక్ష ఫీజు, ఆన్‌లైన్ పరీక్ష సూచనలు వెబ్‌సైట్ https://aptet.apcfss.in ద్వారా తెలుసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ఇప్పటికే పలు ఉద్యోగ నోఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా, టెట్ నోటిఫికేషన్ విడుదల కానునుండటంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications