Jobs : విజయవాడలో ఎల్లుండి జాబ్ మేళా-భారీగా ఉద్యోగాలు..అర్హతలు ఇవే...
ఏపీలో ఉపాధి కల్పన కోసం వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఫిబ్రవరి 28న విజయవాడలో మరో మేళా నిర్వహించబోతోంది.
ఏపీలో ప్రభుత్వం ఈ మధ్య వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. గతంలో తిరుపతి, విశాఖ, గుంటూరులో మెగా జాబ్ మేళాలు నిర్వహించిన ప్రభుత్వం పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది. ఇప్పుడు విజయవాడలో మరో జాబ్ మేళా నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతోంది.
ఈ నెల 28న విజయవాడలో జాబ్ మేళా నిర్వహించేందుకు ఉపాధి కల్పన శాఖ సిద్ధమైంది. జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పీవీ రమేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా వివిధ సంస్ధల్లో 370 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు.

విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ లో ఉన్న ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తారు. పదో తరగతి నుంచి ఈ ఉద్యోగాలకు విద్యార్హతలు మొదలవుతాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఫార్మసీ, బీటెక్, పీజీ అర్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాల కోసం జాబ్ మేళాకు హాజరు కావాలని ఉపాధి అధికారి తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు అభ్యర్ధులు 8008742842 నంబర్ కు కాల్ చేయొచ్చని తెలిపారు. ఈ జాబ్ మేళాకు హాజరయ్యే వారికి ఐటీఐలో కూడా అధికారులు తగిన సహకారం అందిస్తారు.












Click it and Unblock the Notifications