AP : ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల..ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం..
బీఈడీ కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ఎడ్‌సెట్ 2024 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ పరీక్ష ద్వారా బీఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. బీఈడీ కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఈ ఏడాది జూన్ 8వ తేదిన ఏపీ ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రెండేళ్ల రెగ్యులర్ బీఈడీ కోర్సుతో పాటు స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహిస్తోంది.
ఈ కోర్సుకు అప్లయ్ చేసుకునే వారు సంబంధిత విభాగంలో (బీఏ, బీఎస్సీ, బీఎస్సీ హోమ్ సైన్స్, బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్, బీకాం, బీసిఏ, బీబీఎం, బీఈ, బీటెక్) చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు, లేదా డిగ్రీ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, బీఈడీ అడ్మిషన్ సమయానికి మార్క్స్ మెమోను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కోర్సుకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులు సంబంధిత డిగ్రీలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగులకు కనీసం 40 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. బీఈ, బీటెక్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు, మ్యాథ్స్ మెథడాలజీలో ప్రవేశం కోసం కనీసం 55శాతం మార్కుల్ని మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

అభ్యర్థుల వయసు కనీసం 19ఏళ్ల పూర్తయి ఉండాలి. బీఈడీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసే ఓసీ అభ్యర్థులు రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.450 చెల్లించాల్సి ఉంటుంది.బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్ అభ్యర్థులు కనీసం 37 మార్కుల్ని సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు లేవు.
ఇతర ముఖ్యమైన తేదీ వివరాలు..
ఏప్రిల్ 18, 2024న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.
మే 15, 2024 దరఖాస్తు చేసేందుకు చివరితేది.
మే 16 నుంచి 19వరకు రూ. 1000 ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తారు.
మే 20,21 తేదీలలో రూ.2000 ఆలస్య రుసుముతో అప్లయ్ చేసుకోవచ్చు.
మే 22 నుంచి మే 25వ తేదీ వరకు దరఖాస్తుల్లో తప్పుల్ని సరిచేసుకోగలరు.
మే 30 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జూన్ 8న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడ్‌సెట్ పరీక్ష ఉంటుంది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications