ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు 2024 విడుదల..ఇలా చెక్ చేసుకోండి..!
ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఈ నెల 8వ తేదిన ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా వీటి ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందుపరిచారు. ఈ పరీక్షకు హాజరయిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టిక్కెట్ నెంబర్‌తో ఫలితాలను చెక్ చేసుకోగలరు.
రాష్ట్రంలో టీచర్స్ ట్రైనింగ్ కోర్సులు బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్ఈ) తరపున విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహించారు. ఏప్రిల్ 16వ తేదిన ఆంధ్రయూనివర్సిటీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఏప్రిల్ 18 నుంచి ప్రారంభించింది. మే 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.

ఇక, ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష జూన్ 8వ తేదిన జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 9,365 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ జూన్ 15న విడుదల చేశారు. ఆన్సర్ కీ అనంతరం అభ్యంతరాలను తెలిపేందుకు మూడు రోజుల సమయాన్ని కూడా ఇచ్చారు. జూన్ 18 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఇచ్చారు. నేడు (గురువారం) ఏపీ ఎడ్‌సెట్‌కు సంబంధించిన ఫలితాలను ఆంధ్ర యూనివర్సిటీ ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరయిన అభ్యర్థులు ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలను, స్కోర్ కార్డు, ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ నుంచి విడుదల చేసుకోగలరు. అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకునేందుకు నేరుగా https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetResult.aspx ఈ అధికారిక వెబ్‌సైట్ ను సంప్రదించగలరు.
ఫలితాలు చెక్ చేయు విధానం..?
ఏపీ ఎడ్‌సెట్ ఫలితాల కోసం అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetResult.aspx ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కనిపించే రెండు బాక్సుల్లోని మొదటి బాక్స్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, రెండో బాక్స్‌లోని ఎడ్‌సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ ఉన్న వ్యూ రిజల్స్ అనే బటన్‌పై క్లిక్ చేస్తే ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. మీ ర్యాంక్ కార్డును భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా ప్రింట్ తీసుకోవడం ఉత్తమం..












Click it and Unblock the Notifications