ఏపీలో సివిల్ జడ్జీ ఉద్యోగాలు, రూ. లక్ష వరకు జీతం
న్యాయస్థానాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు కీలక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ హైకోర్టు సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో 40 పోస్టులను డైరెక్ట్ రెక్రూట్‌మెంట్ ద్వారా, మరో 10 పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు లా డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన విద్య సంస్థల నుంచి లా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. అభ్యర్థుల వయసు 01.02.2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 77,840 నుంచి 1,36,520 వరకు జీతం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును రూ. 750గా నిర్ణయించారు. జనరల్, ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 1500 చెల్లించాల్సి ఉంటుంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ హైకోర్టులో ఉద్యోగాల నోటిఫికేషన్, మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications