సివిల్ జడ్జి పోస్టులకు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్: 17 నుంచి అప్లై చేయండి
పలు జడ్జీ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అమరావతి: పలు జడ్జీ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 30 సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి అమరావతిలోని రాష్ట్ర హైకోర్టు దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 17 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్(రిక్రూట్‌మెంట్) ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 24 ఖాళీలు, బదిలీల ద్వారా మరో 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 30
అర్హత:
న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ తప్పనిసరి.
వయో పరిమితి:
01.03.2023 నాటికి 35 ఏళ్లు మించరాదు.
వేతనం: రూ. 77,840- రూ. 1,36,520
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధృవపత్రాల పరిశీలన.
స్క్రీనింగ్ పరీక్ష ఫలితాల వెల్లడించిన తర్వాత రాత పరీక్ష నిర్వహిస్తారు.
ఫీజు వివరాలు:
ఓపెన్ కేటగిరీ/ఈడబ్ల్యూఎస్/బీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 1500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులైతే రూ. 750లు చెల్లించాలి.
స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: ఏప్రిల్ 15
కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్:
ఏప్రిల్ 24(ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు)
ప్రిలిమినరీ కీ/అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్ 27.
స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్లు:
గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. అభ్యర్థులు ఏవైనా మూడు కేంద్రాలను ప్రాధాన్యతల వారీగా ఆప్షన్ పెట్టుకోవచ్చు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications