ఏపీ ఇండస్ట్రీస్ రిక్రూట్‌మెంట్: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం, రూ. 15వేల వరకు జీతం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మినిస్టీరియల్ గ్రేడ్ సర్వీసెస్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ విభాగాల్లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తుచేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
మొత్తం ఖాళీలు: 23
పోస్టులు: మొత్తం 23 ఖాళీలకు గాను జూనియర్ అసిస్టెంట్ (08), రికార్డ్ అసిస్టెంట్ (01), ఆఫీస్ సబార్డినేట్ (12), వాచ్‌మెన్ (01), స్వీపర్ (01) ఖాళీలు ఉన్నాయి.

అర్హత: పోస్టుల్ని అనుసరించి తెలుగులో చదవడం, రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.10.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 20. వెబ్‌సైట్: http://www.apindustries.gov.in/
ముఖ్యమైన విషయాలు..
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ది డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, మొదటి అంతస్తు, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ బిల్డింగ్స్, ముత్యాలంపాడు, విజయవాడ, 520011 అడ్రస్‌కు అందించాలి.
ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 12,000 నుంచి రూ. 15,000 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు 20-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి..(https://www.apindustries.gov.in/APIndus/Default.aspx)












Click it and Unblock the Notifications