ఏపీ కేజీబీవీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మహిళలు మాత్రమే అర్హులు..
ఏపీలోని మహిళా నిరుద్యోగులకు శుభవార్త... రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 604 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు. ఆన్లైన్‌లో మాత్రమే అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించారు. నేటి (26.09, 2024) నుంచే దరఖాస్తు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 10వ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువుగా నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీ కేజీబీవీ అధికారిక వెబ్‌సైట్ https://apkgbv.apcfss.in/ దరఖాస్తు చేసుకోగలరు.
రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో బోధన సిబ్బంది పోస్టుల, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక, ఈ పోస్టులను 2024-25 విద్యా సంవత్సరానికి గాను భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు.

పోస్టులు, ఖాళీల వివరాలు..
మొత్తం 604 పోస్టులు..
ప్రిన్సిపల్ 10 పోస్టులు,
పీజీటీ 165 పోస్టులు,
సీఆర్‌టీ 163 పోస్టులు,
పీఈటీ 4 పోస్టులు,
పార్ట్ టైం టీచర్స్ 165 పోస్టులు,
వార్డెన్ 53 పోస్టులు,
అకౌంటెంట్ 43 పోస్టులు,
విద్యార్హతలు..
పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసేవారు రెండేళ్ల పీజీలో ఉత్తీర్ణత సాధించాలి. సీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అలాగే, పీఈటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఫిజికల్ ఎడ్యూకేషన్‌లో బీపీఈడీ, ఎంపీఈడీకికూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. జిల్లాల వారీగా, పోస్టులు వారీగా, రోస్టర్ వారీగా పోస్టుల వివరాలు ఏపీ కేజీబీవి అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరస్తారు. కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే వయో పరిమితి 42 సంవత్సరాలు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు వర్తిస్తుంది. మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్ల వయస్సు సడలింపు, దివ్యాంగులైన అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది. రూ. 250 ఫీజుతో వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.












Click it and Unblock the Notifications