ఏపీ మహేశ్ బ్యాక్ రిక్రూట్‌మెంట్: 200 ఉద్యోగాల కోసం 27లోగా అప్లై చేయండి

హైదరాబాద్/అమరావతి: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇది శుభవార్తే. ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్.. భారీగా క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ దరఖాస్తులను ఆహ్వానించింది.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక మెయిల్ ఐడి ద్వారా 27 మార్చి 2022లోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విడుదలైన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. క్లర్క్ కమ్ క్యాషియర్ 200 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 16 మార్చి 2022 నుంచి కొనసాగుతోంది.

 AP Mahesh Bank Clerk Recruitment 2022: apply now for 200 Posts

ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా ఈ నియామకం ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

అర్హత గల అభ్యర్థులు ఆంధ్ర ప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 27 మార్చి 2022.

వయో పరిమితి:

దరఖాస్తుదారు వయస్సు 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు మార్చి 31, 2022 నుంచి లెక్కించబడుతుంది.

దరఖాస్తు రుసుము:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి రూ. 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2022: ఈ ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ - 16 మార్చి 2022
దరఖాస్తు చివరి తేదీ - 27 మార్చి 2022

ఎంపిక ప్రక్రియ - వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ఆదారంగా ఎంపిక చేయబడతారు.

పే స్కేల్ - జీతం ₹ 23,934/-.

దరఖాస్తు ప్రక్రియ - ఈ ఉపాధి కోసం మీరు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..
నోటిఫికేషన్, ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+