AP PGCET 2024: ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల..జూన్‌లో ప్రవేశ పరీక్షలు..!
ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచే ప్రారంభమయ్యింది. అభ్యర్థుల నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణ బాధ్యత ఆంధ్రా యూనివర్సిటీ తీసుకుంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఈ పరీక్షలో ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 10 నుంచి 14 మధ్య ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంపీఈడీకి రాతపరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ పరీక్షలు మూడు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్నారు. కేటగిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్; కేటగిరీ-2లో కామర్స్ అండ్ ఎడ్యుకేషన్, కేటగిరీ-3లో సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు ఉంటాయి. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు.

పీజీ కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి...
ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐబీఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్ తదితర కోర్సులు..
విద్యార్హత : సంబంధించిన సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం పరీక్ష రాస్తున్నవారు అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లయ్ చేయుటకు ఫీజు వివరాలు :
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 850 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. బీసీలకు రూ.750.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.650 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష. ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలకు, 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. లాంగ్వేజేస్ పేపర్లు మినహా మిగతా అన్ని ప్రశ్నపత్రాలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications