ఏపీ పీజీఈసెట్ రిజల్ట్స్ రిలీజ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
ఆంధ్రప్రదేశ్‌లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్-2025 (AP PGECET) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన అధికారిక సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు. అలానే పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/PGECET/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థుల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. సీట్ల కేటాయింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి వివరాలను APSCHE అధికారికంగా ప్రకటించనుంది. విద్యార్థులు అప్డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలిస్తు ఉండాలి.

ఇక ఈ పరీక్షకు మొత్తం 14,231 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 11,244 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణత శాతం 93.55% గా నమోదైంది. అర్హత సాధించిన వారిలో 5,491 మంది విద్యార్థులు, 5,753 మంది విద్యార్థినులు ఉన్నారు.
మరోవైపు ఏపీ పీజీఈసెట్ 2025 పరీక్షలు జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలు రెండు సెషన్లుగా జరిగాయి. ఉదయం సెషన్: 9:00 AM - 11:00 AM ఒకటి. మధ్యాహ్నం సెషన్: 2:00 PM - 4:00 PM వరకు జరిగాయి. ప్రిలిమినరీ కీ జూన్ 11న విడుదల చేయగా, అభ్యంతరాలను జూన్ 14 రాత్రి 11:59 గంటల వరకు స్వీకరించారు. అంతే కాకుండా ఈ సంవత్సరం పీజీఈసెట్‌ను ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన 13 సబ్జెక్టుల్లో నిర్వహించారు. పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు.
📢 APPGECET- 2025 results are out!
— Lokesh Nara (@naralokesh) June 24, 2025
✅ 93.55% overall pass rate across 13 subjects of Engineering and Pharmacy
📈 14,231 registered | 11244 qualified | 5491(92.58%)boys & 5753 (94.50%)girls qualified
🔗 Download rank cards:
https://https://t.co/eOGxjcXQ5u
📱Also through Mana…












Click it and Unblock the Notifications