Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP SET 2024: ఏపీ సెట్ ద‌రఖాస్తు గ‌డువు పొడిగింపు...ఈనెల 14వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు..

AP SET 2024: ఏపీ సెట్ ద‌రఖాస్తు గ‌డువు పొడిగింపు...ఈనెల 14వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు..ఆంధ్ర యూనివ‌ర్సిటీ నిర్వ‌హిస్తోన్న రాష్ట్ర‌స్థాయి అర్హ‌త ప‌రీక్ష (ఏపీ సెట్ 2024) ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించారు. మార్చి 6.2024 తోనే ఏపీ సెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగియ‌గా.. విద్యార్థుల అభ్య‌ర్థ‌న మేర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించిన‌ట్లు ఏపీసెట్ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ ఆచార్య జీఎంజే రాజు తెలిపారు. మార్చి 14 వ‌ర‌కు ఎలాంటి అద‌నపు ఫీజు లేకుండా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

తాజాగా ఆంధ్రా యూనివర్సిటీ ఏపీసెట్‌-2024 ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా చేరాలనుకునే అభ్యర్థులకు నిర్వహించే అర్హత పరీక్ష.. ఏపీసెట్. ఈ ప‌రీక్ష‌లో అర్హ‌త సాదించిన వారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే, మార్చి 6, 2024వ తేదీతో ఈ అర్హ‌త ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగియ‌గా, తాజాగా ఆ గ‌డ‌వును పొడిగించారు.

AP SET 2024 AP set application deadline extension you can apply till 14th of this month

ఏపీ సెట్‌లో మొత్తం 30 సబ్జెక్టులు...

ఏపీసెట్‌లో మొత్తం 30 సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సొషియాలజీ సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఈ ప‌రీక్ష రెండు భాషల్లో తెలుగు/ఇంగ్లిష్‌లో నిర్వహిస్తారు. మిగతా సబ్జెక్టులు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి. అభ్యర్థులు తాము చదివిన పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్ట్‌ సెట్‌ జాబితాలో లేకపోతే, ఏదైనా ఇతర సంబంధిత సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోగ‌ల‌రు.

విద్యార్హ‌త‌...

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాల అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో పీజీ పూర్తిచేయాలి. పీజీ చివరి సంవత్సరం చ‌దువుతున్న విద్యార్థులు/పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

రెండు పేప‌ర్లు..

ఏపీసెట్‌ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు-100 మార్కులకు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు-200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు.
పేపర్‌-1లో టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఈ పేప‌ర్ అంద‌రకీ కామ‌న్‌గా ఉంటుంది. పేప‌ర్ 1 తెలుగు, ఇంగ్లిష్ మాధ్య‌మంలో ఉంటుంది. పేపర్‌-2 పరీక్ష అభ్యర్థి పోస్టుగ్రాడ్యుయేషన్ ఏ విభాగంలో పూర్తిచేశారో ఆ స‌బ్జెక్టుపై ఉంటుంది.

ముఖ్య‌మైన తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14.03.2024
ఏపీసెట్‌ పరీక్ష తేదీ: 28.04.2024
అభ్య‌ర్థులు ఇత‌ర వివ‌రాల‌కోసం ఈ https://apset.net.in/ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+