AP SSC : రేపే ప‌దోత‌ర‌గతి ఫ‌లితాలు విడుద‌ల...ఇలా చెక్ చేసుకోవ‌చ్చు..

రేపే ఏపీ ప‌ది ఫ‌లితాలు విడుద‌ల‌. ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను ఈ నెల 22న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ ప్ర‌క‌టించింది. ఈ ఏడాది ప‌దోత‌ర‌గతి పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా ముగిసిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ సంవ‌త్స‌రం రికార్డుస్ధాయిలో కేవ‌లం 22 రోజుల్లోనే ఏపీ ఎస్‌ఎస్‌సీ రిజల్ట్స్‌ ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్ల‌డింది. ఈ ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల కార‌ణంగా ఆలోపే ప‌దోత‌ర‌గ‌తి ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఏప్రిల్ 22న ప‌ది ఫలితాల వెల్లడికి డేట్ ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప‌దోత‌ర‌గ‌తి పరీక్షలు జరిగిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయిన‌ట్లు అధికారులు తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6.23 లక్షలు ఉండ‌గా, గతేడాది ఫెయిలై ప‌రీక్ష‌లు రాసిన విద్యార్ధులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు.

AP SSC 10th class results will be released tomorrow you can check like this

ప‌దోత‌ర‌గ‌తి ఫలితాలను ఏప్రిల్ 22వ తేదీ (సోమ‌వారం) ఉద‌యం 11 గంటలకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు. రేపు విజయవాడలో విద్యా శాఖ కమీషనర్ సురేష్‌కుమార్ చేతుల‌మీదుగా ఫలితాలు విడుదల కానున్నాయి. ప‌దోత‌ర‌గ‌తి పరీక్షలు రాసిన విద్యార్థులంతా త‌మ హాల్‌టికెట్ నెంబ‌ర్ ఫ‌లితాల‌ను చెక్‌చేసుకోవ‌చ్చు. విద్యార్థులు https://www.bse.ap.gov.in/ ఈ వెబ్‌సైట్ లో ప‌ది ఫ‌లితాలు చెక్‌చేసుకోవ‌చ్చు.

ఫ‌లితాలు చేక్‌చేసుకోవ‌డం ఎలా..?

ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులు మొదట ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్ హోమ్ పేజీలో క‌నిపించే "AP SSC Results 2024" లింక్‌పై క్లిక్ చేయండి.
ఆ లింక్ ఓపెన్ కాగానే విద్యార్థి హాల్ టికెట్ నంబర్‌ ఎంటర్‌ చేసి.. సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్క‌డ విద్యార్థి ఫ‌లితాలు, మార్కులు డిస్ ప్లే అవుతాయి.
వెంట‌నే మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థులు ఫ‌లితాల‌ను చెక్ చేసుకోవ‌చ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+