AP TET 2024: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్‌టిక్కెట్లు వచ్చేసాయ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఏపీలోని ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లు వచ్చేసాయ్.. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ టెట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోగలరు. టెట్ జులై 2024 పరీక్షలకు ఈసారి రికార్డు స్థాయిలో మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక, ఈ పరీక్షలు వచ్చే నెల 3వ తేది నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయి. సిబిటి విధానంలోనే ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జరగగా, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు.
అందుబాటులో నమూనా పత్రాలు ...
ఇప్పటికే ఆన్‌లైన్‌లో పరీక్షలకు సంబంధించిన నమూనా పత్రాలు అధికారులు అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా టెట్ హాల్‌టిక్కెట్లు కూడా విడుదల చేశారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు https://aptet.apcfss.in/ ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు. అక్టోబర్ 3 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

అక్టోబర్ 4 తర్వాత (పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత వెంటనే) ప్రాథమిక 'కీ'లు వరుసగా విడుదల చేయనున్నట్లు అధికారులు గతంలోనే ప్రకటించారు. అక్టోబర్ 5వ తేది నుంచి ప్రాథమిక కీలపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 27వ తేదిన తుది 'కీ' విడుదల చేయనున్నారు. టెట్ జులై 2024 పరీక్ష ఫలితాలను నవంబర్ 2న విడుదల చేస్తారు. ఆన్‌లైన్‌లో ఎలాంటి పాస్‌వర్డ్ అవసరం లేకుండానే వివిధ మాధ్యమాల్లో ప్రశ్నపత్రాల నమూనా పత్రాలను వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇక, ఈ మాక్ టెస్ట్ ల ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే టెట్ పరీక్షని ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాసేందుకు వీలుంటుంది.
అర్హత మార్కులు వివరాలు..
ఓసీ(జనరల్) అభ్యర్థులు- 60% మార్కులు ఆపైన ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
బీసీ అభ్యర్థులు - 50% మార్కులు ఆపైన ఉత్తీర్ణత సాధించాలి.
ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు - 40% మార్కులు ఆపైన ఉత్తీర్ణత సాధించాలి.












Click it and Unblock the Notifications