AP TET Results 2024 : నేడే టెట్ ఫలితాలు విడుదల... ఇలా చెక్ చేసుకోండి...
AP TET Results 2024 : నేడే టెట్ ఫలితాలు విడుదల... ఇలా చెక్ చేసుకోండి : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు నేడు (మార్చి 14) విడుదలకానున్నాయి. ఏపీ విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 14వ తేదీ అంటే నేటి నుంచే వెబ్ సైట్ లో టెట్ ఫలితాలు అందుబాటులో పెట్టనుంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఏపీ టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పరీక్షల అనంతరం ఏపీ విద్యాశాఖ రెస్పాన్స్‌షీట్‌లను కూడా విడుదల చేసిన విషయం విదితమే. ప్రాథమిక కీని కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈమేరకు అభ్యర్థులనుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఇందులో భాగంగా నేడు ఫైనల్ రిజల్ట్‌ను విడుదల చేయనుంది. టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఏపీ టెట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి https://aptet.apcfss.in/ వ వెళ్లి తమ తుది ఫలితాలను చెక్‌చేసుకోగలరు.
ఇక, ఏపీ టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ అనంతరం డీఎస్సీ పరీక్షకు సంబంధించి ఏపీ విద్యాశాఖ కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గడువుపై ఇటీవలే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ డీఎస్సీ కొత్త షెడ్యూల్‌ను వెల్లడించింది. ఇందులో భాగంగానే ఈ నెల 30 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక, ఈ పరీక్షలు వచ్చే నెల 30 వరకు కొనసాగనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పేర్కొంది.

డీఎస్సీ కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి : ఈ నెల 30 నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు వచ్చే నెల అంటే ఏప్రిల్ 30 వరకు కొనసాగనున్నాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పది సెషన్లలో సెకండర్ గ్రేడ్ పరీక్షలు జరగనున్నాయి. ఇక, ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించిన ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టును నిర్వహించనున్నారు. వచ్చే నెల 13 నుంచి 30 వరకు ఎస్ఎ, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. ఏపీ డీఎస్సీ పరీక్షకు సంబంధించి మార్చి 20 నుంచి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెల 25 నుంచి అభ్యర్థులు డీఎస్సీ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications