AP : టెట్ ఫలితాలు వచ్చేసాయ్..ఇలా చెక్ చేసుకోండి...
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలను నేడు (నవంబర్ 4) మంత్రి నారా లోకేశ్ చేతుల మీదగా విడుదల చేశారు. ఇక, ఈ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫలితాలను చెక్ చేసుకోగలరు. రాష్ట్రంలో టెట్ పరీక్షలు అక్టోబర్ 3వ తేది నుంచి 21వ వరకు మొత్తం 17 రోజుల జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
ఇటీవలే టెట్ పరీక్ష ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విద్యాశాఖ విడుదల చేసింది. అన్ని సబ్జెక్టులకు అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఆ తర్వాత ఫైనల్ ఆన్సర్ కీన రూపొందించి.. దానిని గత నెల (అక్టోబర్) 29న విడుదల చేశారు. ఇక, నేటి ఉదయం టెట్ పరీక్ష ఫలితాలను ఏపీ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షకు సుమారు 4,27,300 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

అందులో 3,68,661 మంది అంటే 86.28 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక, ఈ పరీక్షల్లో 1,87,256 (50.79 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. వారందరికీ ఆయన శుభాకాంక్షలు కూడా తెలిపారు. టెట్ అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నావాటిని నివృత్తి చేసుకునేందుకు హెల్ప్ డెస్క్ నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని అన్నారు. అభ్యర్థులు టెట్ ఫలితాలు కోసం ఈ వెబ్‌సైట్‌ను https://cse.ap.gov.in సంప్రదించగలరు.
నవంబర్ 6న ప్రకటన..
విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు ఈ నెల (నవంబర్ ) విడుదల చేయాల్సి ఉండగా, తుది 'కీ' ఆలస్యంగా వెల్లడించడంతో ఫలితాలు వాయిదా పడ్డాయి. డీఎస్సీలో టెట్ స్కొర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. పైగా టెట్ స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది. మెగా డీఎస్సీ క్రమంలో టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే ఈ సారి అభ్యర్థులకూడా అమాంతం పెరిగింది. మెగా డీఎస్సీకి సంబంధించి 16,347 పోస్టులతో నవంబర్ 6న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు ఉంటాయని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications