APCOBలో ఉద్యోగాలు: .డిగ్రీ అర్హత: మంచి జీతం: పూర్తి వివరాలు చూడండి..!!

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీలోని బ్యాంకులో పనిచేయాలనుకునేవారికి ఇది మరింత మంచి వార్త అవుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా మేనేజర్ స్కేల్-1 మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 61 పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్ స్కేల్ -1కు 26 పోస్టులు ఉండగా... స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు 35 ఉన్నాయి. మేనేజర్ స్కేల్ -1 మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు కావాల్సిన విద్యార్హతలను పేర్కొంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు ఉండాలి. వయస్సు పరంగా ప్రభుత్వ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇక ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

APCOB Recruitment 2021:Apply for 61 Manager scale-1 and staff assistant posts

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రక్రియ

1. అధికారిక ఆప్కాబ్ (APCOB) వెబ్‌సైట్‌ సందర్శించాలి

2.హోమ్ పేజ్ పై కెరీర్స్ సెక్షన్‌కు వెళ్లి అక్కడ అప్లయ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మేనేజర్ ఎస్‌సీ-1 మరియు స్టాఫ్ అసిస్టెంట్ అనే లింక్ పై క్లిక్ చేయాలి.

3.మరో విండో ఓపెన్ అవుతుంది. క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనే లింక్ పై క్లిక్ చేయాలి

4.అక్కడ సంబంధిత వివరాలు అంటే విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

5.ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి సబ్మిట్ బటన్‌ పై క్లిక్ చేస్తే చాలు. మీ దరఖాస్తు సబ్మిట్ అవుతుంది.

ఫీజు వివరాలు:
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు : రూ.500/-

జనరల్ అభ్యర్థులకు : రూ.700/-

ఇక ఆప్కాబ్‌లో మేనేజర్‌ స్కేల్-1కు వేతనం నెలకు రూ.60,943 ఉండగా స్టాఫ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.32,854/-గా ఉంది.

దరఖాస్తుల ప్రక్రియ జూలై 21 నుంచి ప్రారంభమైంది. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్‌లు పూర్తి చేసేందుకు చివరి తేదీ 5 ఆగష్టు 2021.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+