అలర్ట్: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ మార్పు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. డిసెంబర్ 18న జరగాల్సిన ఈ పరీక్షను పాలనా పరమైన కారణాలతో మరో తేదీకి మార్పు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. కొత్త తేదీని కూడా ప్రకటించారు.

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ టైమింగ్స్ ప్రకరామే ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

appsc group-1 prelims exam date postponed to Jan 8th

నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ నెలాఖరులో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 92 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేసేందుకు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 5 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించారు. కాగా, ప్రిలిపినరీ పరీక్ష వచ్చే జనవరి 8న జరగనుండగా.. మెయిన్ పరీక్షను మార్చి 15, 2023లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+