మరో 38 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ : డిసెంబర్ 7 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు..!!

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా జారీ చేస్తున్న నోటిఫికేషన్లలో భాగంగా మరో 38 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. పోస్టుల్లో.. అసిస్టెంట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (ఏపీఆర్వో) (6), అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (29), ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (1), హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 (2) ఉన్నాయి. ఈ పోస్టులకు నవంబర్‌ 12 నుంచి డిసెంబర్‌ 7 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇస్తున్న అనుమతిలో భాగంగా నాలుగు రోజుల క్రితమే ఏపీపీ ఎస్సీ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా.. ఏపీ ఆర్‌డబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌ ఇంజనీరింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్, పీహెచ్‌ అండ్‌ ఎంఈ సబార్డినేట్‌ సర్వీస్, ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎంపీఎల్‌ ఇంజనీరింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్, ఏపీ గ్రౌండ్‌ వాటర్‌ సబార్డినేట్‌ సర్వీస్, ఏపీ పంచాయతీరాజ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌లు, ఎండోమెంట్‌ సబార్డినేట్‌ సర్వీస్, ఏపీ వాటర్‌ రిసోర్సెస్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ ల పోస్టులు భర్తీ చేయనున్నారు.

APPSC Issued another notification for different post in govt deptmts

ఈ పోస్టులకు అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ /బీటెక్, ఎల్‌సీఈ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. అదే విధంగా వయసు 1.07.2021 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. దీనికి సంబంధించిన పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. దీన్ని మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.

దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. న్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 21.10.2021 కాగా, ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 11.11.2021గా ఖరారు చేసారు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in సంప్రదించాలని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+