ఉద్యోగాల భర్తీకి నాలుగు నోటీఫికేషన్ల విడుదల : 42 ఏళ్ల వయో పరిమితి -ఉత్తర్వులు జారీ..!!

ఏపీ పబ్లిక్ సర్వీసు కమిషన్ నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుల చేసింది. 39 హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి వచ్చే నెల 11 నుంచి నవంబర్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించినున్నట్లు వెల్లడించింది. అదే విధంగా..24 లెక్చరర్లు / అసిస్టెంట్ హోమియో ప్రొఫెసర్ ..3 లెక్చరర్లు..అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు భర్తీకి దరఖాస్తులను అక్టోబర్ 7 నుంచి 28వ తేదీ మధ్య పంపాలని ఏపీపీఎస్సీ సూచించింది. అదే విధంగా 5 తెలుగు రిపోర్టర్ల పోస్టుల భర్తీకి అక్టోబర్ 18 నుంచి నవంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉద్యోగ పరిమితి వయసు పైన నిర్ణయం కోసం నిరుద్యోగులు నిరీక్షించారు. అయితే, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేసే ఉద్యోగాల కోసం అభ్యర్థుల వయో పరిమితిని 42 ఏళ్లకే పరిమితం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.

APPSC issued four job notification for 71 posts and age relaxation for 42 years

ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు అభ్యర్థుల వయో పరిమితి వాస్తవానికి 34 ఏళ్లు. అయితే, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గత టీడీపీ ప్రభుత్వం వయో పరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ 2016లోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల గడువు పాత నోటిఫికేషన్లతో ముగిసిపోయింది. దీంతో మళ్లీ అదే వయోపరిమితిని కొనసాగిస్తూ జీవో జారీ చేశారు. 30.9.2022లోపు ఏపీపీఎస్సీ విడుదల చేసే ఉద్యోగాలకు ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. సంవత్సరం పాటు ఏపీపీఎస్సీ జారీ చేసే నోటిఫికేషన్లు ఇదే వయో పరిమితి వర్తిస్తుంది.

Recommended Video

    Interview with Praja Sangala leader Sagar On 27 Bandh | Oneindia Telugu

    ఇక, కొద్ది నెలల క్రితం ఏపీ ప్రభుత్వం దాదాపు పది వేలకు పైగా.. ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. దీని పైన అనేక విమర్శలు వచ్చాయి. రాజకీయ విమర్శలతో పాటుగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇదే సమయంలో మరో జాబ్ క్యాలెండర్ కు ప్రభుత్వం సిద్దం అవుతుందనే వార్తలు వచ్చాయి. అందులో భాగంగా ఇప్పుడు నాలుగు నోటిఫికేషన్ల ద్వారా 71 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. అయితే, చాలా కాలంగా కొత్త నోటిఫికేషన్లు జారీ కాకపోవటంతో..నిరుద్యోగులు వయో పరిమితి పెంచాలని కోరుతూ వచ్చారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వం 42 ఏళ్ల వయసునే కటాఫ్ గా తీసుకోవటంతో..దీని పైన ఇప్పుడు స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+