Jobs : ఏపీఎస్ఆర్‌టిసిలో 606 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. మార్కుల ఆధారంగా ఎంపిక‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయవాడ, కర్నూలు జోన్ల పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 606 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఆయా ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. విజయవాడ జోన్లలోని ఖాళీలకు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునేవారు నవంబర్‌ 6వ తేదీ నుంచి నవంబర్‌ 20వ తేదీ వరకు అప్ల‌య్ చేసుకోవచ్చు. వీటితోపాటు కర్నూల్‌ జోన్‌ పరిధిలోని ఖాళీలకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునేవారు నేటి నుంచి నవంబర్ 19 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల‌కు ఎటువంటి రాత‌ప‌రీక్ష ఉండ‌దు. ఆయా ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ నిర్వహిస్తారు. ఐటీఐ మార్కులు, సీనియారిటీ ప్రకారం అప్రెంటిస్ అభ్యర్థులను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. ఏపీఎస్‌ఆర్‌టీసీ కర్నూలు జోన్‌లో అయితే 295 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విజయవాడ జోన్‌లో 311 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ వంటి ట్రేడులున్నాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు కింద ప్రతి ఒక్క అభ్య‌ర్థి రూ.118 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

APSRTC release job notification for 606 posts details here

ఖాళీల వివరాలివే:

కృష్ణా జిల్లా : 41
ఎన్టీఆర్ జిల్లా : 99
గుంటూరు జిల్లా : 45
బాపట్ల జిల్లా : 26
పల్నాడు జిల్లా : 45
ఏలూరు జిల్లా : 24
పశ్చిమగోదావరి జిల్లా: 31
కర్నూలు జిల్లా : 47
నంద్యాల జిల్లా : 45
అనంతపురం జిల్లా : 53
శ్రీసత్యసాయి జిల్లా: 37
కడప జిల్లా : 65
అన్నమయ్య జిల్లా : 48

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+