బీబీనగర్ ఎయిమ్స్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 11లోగా దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోలకు శుభవార్త. బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో 63 పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదలైంది. నాన్ అకాడమిక్ విభాగంలో సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్ల పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 11 లోగా [email protected] అనే ఈ మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నారు. అప్లికేషన్ ఫాంను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సీనియర్ రెసిడెంట్ల విభాగంలో మొత్తం 38 ఖాలీలను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్ మెడిసిన్ అండ్ అనస్తీషియా, పీడియాట్రిక్స్, సీఎఫ్ఎం, బయో కెమిస్ట్రీ అండ్ మైక్రో బయాలజీ, ఆర్తోపెడిక్స్, ఫార్మకాలజీ అండ్ రేడియాలజీ, ట్రాన్స్ఫూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఓబీజీవై అండ్ ఈఎన్టీ, తదితర డిపార్ట్‌మెంట్లలో ఖాళీలు ఉన్నాయి. ఎండీ/ఎంఎస్/డీఎం/మాస్టర్ ఆఫ్ కెమిస్ట్రీ, డీఎన్బీ విద్యార్హత కలిగినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఖాళీల భర్తీ కోసం నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

 BB Nagar AIIMS released a notification for 63 posts

అభ్యర్థులు రూ. 1500లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజులో రూ. 300 రాయితీ ఇచ్చారు. వారు రూ. 1200 చెల్లిస్తే సరిపోతుంది. మహిళలు, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.

నోటిఫికేషన్, అప్లికేషన్ ఫాం తదితర వివరాల కోసం అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేయండి.

జూనియర్ రెసిడెంట్ల విభాగంలో మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులతోపాటు ఇంటర్న్‌సిప్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/స్టేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 37 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తులు ఖాళీల కన్నా మూడు రెట్లు ఎక్కువగా వస్తే ఇంటర్వ్యూలను నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలు, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+