బెల్‌లో ఉద్యోగాలు, భారీగా మొత్తంలో జీతం
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో ప్రొబేషనరీ ఇంజినీర్ ఎలాక్ట్రానిక్స్ 200, మెకానికల్ 150 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్‌లకు 143 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌లకు 35, ఓబీసీ (ఎన్‌సీఎల్)కు 94, ఎస్సీలకు 52, ఎస్టీలకు 26 కేటాయించారు.
అర్హతలు :
కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ మెకానికల్ బ్రాంచ్‌లతో పాటు బీఈ/ బీటెక్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ బీఎస్సీ కోర్సుల్లో ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు పాసైతే సరిపోతుంది.
ఇవే బ్రాంచిలతో జీఐఈటీఈ/ ఏఎంఐఈ/ ఏఎంఐఈటీఈ పూర్తిచేసిన అభ్యర్థులు, బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారూ అర్హులే. అయితే రెండు స్పెషలైజేషన్లు చేసినవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.

వయో పరిమితి:
01.01.2025 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ (ఎన్‌సీఎల్), మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షకు (సీబీటీ) ఎంపిక చేస్తారు. దీంట్లో జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌లు 35 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 30 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి. వీరిని 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతంగా విభజించి దాని ప్రకారం పరీక్ష నిర్వహిస్తారు.
125 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. టెక్నికల్ ప్రశ్నలు 100, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత తుది ఎంపిక ఉంటుంది.
జీతం వివరాలు:
నెలకు రూ.40,000-1,40,000. మూల వేతనంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, కన్వీయన్స్ అలవెన్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్ రీఎంబర్స్‌మెంట్ సదుపాయాలూ ఉంటాయి.
దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2025
పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా
నోటిఫికేషన్, మరిన్ని వివరాల కోసం బెల్ అధికారిక వెబ్‌సైట్ https://bel-india.in ను సంప్రదించవచ్చు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications