BEML దిమ్మతిరిగే ఆఫర్.. నెలకు రూ.2.6 లక్షల జీతంతో జాబ్స్ !
కేంద్ర ప్రభుత్వరంగానికి చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) నిరుద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. మొత్తం 682 ఖాళీల కోసం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారీ జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పొచ్చు.
మొత్తం ఖాళీలు..
682
అర్హతలు..
- ITI (టెక్నికల్ పోస్టులు)
- డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్
- నర్సింగ్ & ఫార్మసీ
- ఇంజనీరింగ్ డిగ్రీ (B.E/B.Tech)
- పోస్ట్-గ్రాడ్యుయేషన్ (MBA, M.Tech)
- CA/ICWA వంటి ప్రొఫెషనల్ అర్హతలు
- ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హతలు ఉండటం వల్ల అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలు పరిశీలించడం అవసరం.

వయస్సు పరిమితులు..
- అభ్యర్థుల వయస్సు పోస్టుల వారీగా ఈ విధంగా నిర్ణయించారు:
- స్టాఫ్ నర్స్ & ఫార్మసిస్ట్: 25-35 సంవత్సరాలు
- నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 18-30 సంవత్సరాలు
- తాత్కాలిక ఉద్యోగులు (డిప్లొమా/ITI): నిబంధనల ప్రకారం
- మేనేజ్‌మెంట్ ట్రైనీ: 27 సంవత్సరాలు
- సీనియర్ మేనేజ్‌మెంట్ పోస్టులు: 50-55 సంవత్సరాలు
- రిజర్వేషన్ కేటగిరీలకు వయస్సులో సడలింపు కూడా ఉంది. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు అదనపు వయస్సు పరిమితి వర్తిస్తుంది.
జీతభత్యాలు..
- ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇవ్వబడతాయి.
- సెక్యూరిటీ & ఫైర్ గార్డ్స్: రూ.22,000 - రూ.25,000
- స్టాఫ్ నర్స్ & ఫార్మసిస్ట్: ₹29,200 - ₹62,000
- నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: రూ.23,000 - రూ.27,000
- తాత్కాలిక ఉద్యోగులు (డిప్లొమా/ఐటీఐ): రూ.20,000 - రూ.24,000
- మేనేజ్‌మెంట్ ట్రైనీ: రూ.40,000 - రూ.1,40,000
- సీనియర్ మేనేజ్‌మెంట్ పోస్టులు: రూ.70,000 - రూ.2,60,000
- జీతభత్యాలతో పాటు PF, మెడికల్ సౌకర్యాలు, గ్రాట్యుటీ, బోనస్, పెన్షన్ వంటి ప్రభుత్వరంగ ప్రయోజనాలు కూడా అందుతాయి.
ఎంపిక విధానం..
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
- మల్టీ-స్టేజ్ సెలెక్షన్ ప్రాసెస్ కారణంగా నిజంగా ప్రతిభ కలవారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు..
- జనరల్/OBC అభ్యర్థులు: రూ.500
- SC/ST/PwBD/ఎక్స్-సర్వీస్ మెన్: ఫీజు మినహాయింపు
దరఖాస్తు గడువు..
చివరి తేదీ: 2025 ఆగస్టు 25
అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. పూర్తి వివరాలు & అప్లికేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ 🔗 https://www.bemlindia.in/careers/ ని చూడొచ్చు.












Click it and Unblock the Notifications