Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BHELలో ఉద్యోగాలు: ఇంజినీర్ మరియు సూపర్‌వైజర్ పోస్టులకు అప్లయ్ చేయండి

ప్రభుత్వ రంగ సంస్థ BHELలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజినీర్ మరియు సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజినీర్ విభాగంలో 7 పోస్టులు ఖాళీగా ఉండగా సూపర్ వైజర్ విభాగంలో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీహెచ్ఈఎల్‌లో పోస్టుల భర్తీ ప్రక్రియ ఇలా ఉంది.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ విడుదల చేసిన ఇంజినీర్ మరియు సూపర్ వైజర్ పోస్టులకు అర్హతలు ఇలా ఉన్నాయి. ఇంజినీర్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా బీఈ /బీటెక్ లేదా ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. లేదా ప్రోగ్రామ్ ఇన్ ఇంజినీరింగ్ కలిగి ఉండటంతో పాటు రెండేళ్ల పని అనుభవంకలిగి ఉండాలి. ఇక సూపర్‌వైజర్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనవర్శిటీ లేదా బోర్డు నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్ డిప్లొమా కలిగి ఉండాలి. దీంతో పాటు రెండేళ్ల పాటు పని అనుభవం తప్పనిసరి.

BHEL had issued notification to fill up Engineer and supervisor posts.

ఈ రెండు విభాగాల్లో పోస్టులు ఒప్పంద ప్రాతిపదికన ఉంటాయి. ఈ సమయంలో ఇంజనీర్‌కు వేతనంగా నెలకు రూ.71,040/- చెల్లించడం జరుగుతుంది. ఇక సూపర్‌వైజర్ పోస్టులకు నెలకు రూ. 39,670/- చెల్లించడం జరుగుతుంది. ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 34 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇక కేంద్రప్రభుత్వ నిబంధనలు రిజర్వ్ కేటగిరీకి వర్తిస్తాయి. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు.

బీహెచ్‌ఈఎల్‌లో ఇంజినీర్ లేదా సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజులో భాగంగా రూ. 200/- చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులు ఎలాంటి అప్లికేషన్ ఫీజులు చెల్లించక్లర్లేదు. బీహెచ్‌ఈఎల్ విడుదల చేసిన ఇంజినీర్/సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ముఖ్య తేదీలు ఇలా ఉన్నాయి.

నోటిఫికేషన్ విడుదల తేదీ: 4 సెప్టెంబర్ 2021

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ: 4 సెప్టెంబర్ 2021

ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేసేందుకు చివరి తేదీ: 24 సెప్టెంబర్ 2021

పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: careers.bhel.in

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+