Abroad Education: విదేశీ విద్యపై మారుతున్న స్టూడెంట్స్ ఛాయిస్.. భారత్‌తో పెట్టుకున్న ఆ దేశం పని గోవిందా..

Education News: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు కలగంటున్నారు. అమెరికాతో పాటు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ముఖ్య గమ్యస్థానాలుగా ఉన్నాయి. అయితే పరిస్థుతుల్లో మార్పుల కారణంగా విద్యార్థుల ఎంపికలోనూ మార్పులు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా దీని ప్రభావం భారతీయ స్టూడెంట్స్‌పై ఎక్కువగా ఉంటోంది.

బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా ప్రభుత్వాలు ఇటీవల వీసా మరియు ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో మార్పులు చేశాయి. IDP ఎడ్యుకేషన్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం
ఈ మార్పులు విద్యార్థుల ఎంపికపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 114 దేశాలకు చెందిన సుమారు 6 వేలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

Big changes in student choices for education in abroad

ఉన్నత విద్యకు ప్రముఖ విదేశీ గమ్యస్థానాలైన బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో పోలిస్తే అమెరికా, న్యూజిలాండ్ మాత్రమే గత సంవత్సరం కంటే ఎక్కువగా స్టూడెంట్స్‌ను ఆకర్షిస్తున్నాయి. మరో విశేషమేమిటంటే ఆ దేశాల్లో కేవలం ఈ రెండు మాత్రమే గతేడాది కొత్తగా నిబంధనలను తీసుకురాలేదు. సాధారణంగా భారత విద్యార్థులు కెనడాకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ భారత ప్రభుత్వంతో ఆ దేశానికి విభేదాలు పెరుగుతూ ఉండటం, కఠిన నిబంధనల వల్ల ఇలా జరుగిదని నివేదిక వెల్లడించింది.

గతేడాదితో పోలిస్తే ఒక శాతం తగ్గుదలతో 24 శాతం మంది విద్యార్థులు ఆస్ట్రేలియావైపు మొగ్గుచూపారు. అదే ఒకశాతం తగ్గుదలతో 21 శాతం మంది బ్రిటన్‌ కు ఓటేశారు. 9 శాతం భారీ తగ్గుదలతో కేవలం 16 శాతం మంది విద్యార్థులే కెనడాను ఎంచుకున్నారు. అమెరికాను 4 శాతం పెరుగుదలతో 23 శాతం, ఒక శాతం పెరుగుదలతో 5 శాతం మంది న్యూజిలాండ్‌ను తమ గమ్యస్థానంగా ఎంపిక చేసుకున్నారు.

ఈ విధంగా విద్యార్థుల ఎంపికపై వివిధ కారణాలు ప్రభావం చూపాయని IDP ఎడ్యుకేషన్ వెల్లడించింది. పోస్ట్ స్టడీ వర్క్ వీసా పొందే అవకాశాలు, శాశ్వత నివాసం, విద్యార్థి వీసాకు కావాల్సిన నగదు, వీసా సంబంధిత ఖర్చులు, వీసాల మార్పు, అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వామంతో పాటు ప్రభుత్వాల మార్పు కీ రోల్ పోషించాయని పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 66 శాతం మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ గమ్యస్థానాలను పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+