బ్యాంక్ ఆఫ్ బరోడాలో 300కుపైగా ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఈవెల్త్ రిలేషన్షిప్ మేనేజర్, గ్రూప్ సేల్స్ హెడ్ (వర్చువల్ ఆర్ఎం సేల్స్ హెడ్), ఆపరేషన్స్ హెడ్-వెల్త్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు www.bankofbaroda.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 30న ప్రారంభమైంది.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 20.

ఖాళీలు: అర్హతలు:
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్:
24 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు.
ఈ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్:
23 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు.
గ్రూప్ సేల్స్ హెడ్ (వర్చువల్ RM సేల్స్ హెడ్):
31 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు.
ఆపరేషన్స్ హెడ్-వెల్త్:
35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు.
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్:
భారత ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు లేదా ఏఐసీడీఈచే ఆమోదించబడిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా రంగంలో డిగ్రీ.
ఈ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్:
భారత ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు లేదా ఏఐసీటీఈ ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ.
గ్రూప్ సేల్స్ హెడ్ (వర్చువల్ ఆర్ఎం సేల్స్ హెడ్):
భారత ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు లేదా ఏఐసీటీఈ ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ.
ఆపరేషన్స్ హెడ్-వెల్త్:
ప్రభుత్వ గుర్తింపుతో యూనివర్సిటీ లేదా ఇతర సంస్థలో గ్రాడ్యుయేట్. ప్రసిద్ధ కళాశాలల నుంచి ఎంబీఏ లేదా తత్సమాన డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
బీవోబీ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications