Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.69,100 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. DON'T MISS

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నిరుద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. స్పోర్ట్స్ కోటాలో నియామకాల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ సరిహద్దుల భద్రతతో పాటు క్రీడారంగంలో ప్రతిభ చూపిన యువతకు అవకాశం కల్పిస్తుంది. మొత్తం 549 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇవి గ్రూప్ 'C' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులు కావడం విశేషం. ఇందులో 277 పోస్టులు పురుషులకు, 272 పోస్టులు మహిళలకు కేటాయించారు.

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి (10వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా, గుర్తింపు పొందిన క్రీడల్లో ప్రతిభ కలిగి ఉండాలి. అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, హాకీ, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, షూటింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, సైక్లింగ్ వంటి క్రీడలలో పాల్గొన్న అనుభవం తప్పనిసరి. గత రెండేళ్లలో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించినవారు లేదా ఆ స్థాయి పోటీల్లో పాల్గొన్నవారు అర్హులుగా పరిగణించబడతారు.

border-security-force-notification-for-549-constable-posts-in-sports-quota

వయోపరిమితి..

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం & ఫీజు..

ఈ నియామకాలకు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు..

డిసెంబర్ 27, 2025 నుంచి జనవరి 15, 2026 వరకు

దరఖాస్తు రుసుము..

జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.159 చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ..

ఈ నియామకాలలో ప్రత్యేకత ఏమిటంటే రాత పరీక్ష లేదు.

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఈ దశల ద్వారా జరుగుతుంది:

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)

క్రీడా ప్రదర్శన ఆధారిత మెరిట్ లిస్ట్

ధ్రువపత్రాల పరిశీలన (డాక్యుమెంట్ వెరిఫికేషన్)

వైద్య పరీక్ష (మెడికల్ టెస్ట్)

జీతభత్యాలు..

ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 ప్రకారం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ప్రాథమిక జీతం లభిస్తుంది. దీనితో పాటు

డీఏ (Dearness Allowance),

హెచ్‌ఆర్‌ఏ,

వైద్య సౌకర్యాలు,

పెన్షన్,

ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+