BSF Recruitment: మంచి జీతం, గ్రూప్ సీ పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక బీఎస్ఎఫ్ వెబ్‌సైట్‌లో rectt.bsf.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇంజినీరింగ్ సెటప్‌లోని గ్రూప్ 'సి' కాంబాటైజ్డ్ (నాన్ గెజిటెడ్-నాన్ మినిస్టీరియల్) పోస్టులలో మొత్తం 72 ఖాళీలను భర్తీ చేస్తారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 29, 2021.

పోస్టుల వివరాలు:
ఏఎస్ఐ(DM Gde-III) - 1
హెచ్‌సీ (Carpenter) - 4
హెచ్‌సీ (Plumber) - 2
కానిస్టేబుల్ (Sewerman) - 2
కానిస్టేబుల్ (Generator Operator) - 24
కానిస్టేబుల్ (Generator Mechanic) - 28
కానిస్టేబుల్ (Linemen) - 11
బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ 2021:
వయో పరిమితి:
అభ్యర్థులు డిసెంబర్ 29, 2021 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
జీతం వివరాలు:
ASI(DM Gde-III) Pay matrix level-5 (Rs.29,200-92,300) 7th CPC ప్రకారం.
HC - Pay matrix level-4 (Rs.25,500-81,100) 7th CPC ప్రకారం.
Constable Level - 3. Rs. 21,700-69,100. 7th CPC ప్రకారం.
దరఖాస్తు విధానం:
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి. దరఖాస్తు సమర్పణ కోసం ఏ ఇతర మోడ్ అంగీకరించబడదు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(http://rectt.bsf.gov.in/static/bsf/pdf/BSF%20Group-C%20Engineers%20Recruitment.pdf)












Click it and Unblock the Notifications