CAG Jobs:తెలుగు రాష్ట్రాల్లో ఆడిటర్ అకౌంటెంట్ ఉద్యోగాలు..మంచి జీతం వివరాలివే..!
కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 10811 ఆడిటర్ మరియు అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఏపీలో 144 ఆడిటర్ పోస్టులు ఉండగా తెలంగాణలో 220 పోస్టులు ఉన్నాయి. ఇక తెలంగాణకు 132 అకౌంటెంట్ పోస్టులు ఉండగా ఏపీలో 120 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 ఫిబ్రవరి 2021.
సంస్థ పేరు: కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ఆడిటర్ మరియు అకౌంటెంట్
పోస్టుల సంఖ్య: 10811
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 19 ఫిబ్రవరి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత
వయస్సు: 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19 ఫిబ్రవరి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: cag.gov.in












Click it and Unblock the Notifications