CAGలో క్లర్క్, అకౌంటెంట్, ఆడిటర్ ఉద్యోగాలు: మంచి జీతం..అర్హతలు ఇవే..!!

కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టులు భర్తీ చేసేందుకు కాగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా క్లర్కు, ఆడిటర్స్, అకౌంటెంట్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక కాగ్ నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులన్నీ స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయడం జరుగుతుందని పేర్కొంది. క్రికెట్ మరియు ఫుట్ బాల్ క్రీడా విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. క్రికెట్ ఫుట్‌బాల్ విభాగంలో పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాడ్మింటన్ మరియు టేబుల్ టెన్నిస్‌ క్రీడా విభాగంలో పురుషులు మరియు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఇండియన్ ఆడిట్ మరియు అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, కాగ్‌ సంయుక్త నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 199 పోస్టులను భర్తీ చేయనుంది.అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్‌ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ (cag.gov.in)ను సందర్శించి డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేసి కాగ్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలతో కూడిన అప్లికేషన్‌ పంపాల్సిన చిరునామా కోసం అధికారిక నోటిఫికేషన్‌లో చూడగలరు.

CAG Recruitment 2021:Apply for Clerk Accountant and Auditor jobs

ఆడిటర్ మరియు అకౌంటెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ కలిగి ఉండాలి. ఇక క్లర్క్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పాస్ అయి ఉండాలి. ఈ విద్యార్హతలతో పాటు అభ్యర్థులు పైన ఇచ్చిన క్రీడల్లో అంటే క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో దేశం తరపున లేదా రాష్ట్రస్థాయిలో సీనియర్ లేదా జూనియర్ స్థాయిలో పాల్గొని ఉండాలి. ఇక యూనివర్శిటీ తరపున ప్రాతినిథ్యం వహించిన వారు కూడా పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో ఉంది.

కాగ్ ఉద్యోగ ప్రకటన ప్రకారం అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు గరిష్ట వయస్సు 27 ఏళ్లుగా ఉండాలని పేర్కొంది. మొత్తం 199 పోస్టుల్లో 125 పోస్టులు ఆడిటర్ మరియు అకౌంటెంట్ పోస్టులకు కేటాయించడం జరిగింది. మరో 74 క్లర్క్ పోస్టులు స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడం జరుగుతుంది. ఇక వేతనాల విషయానికొస్తే అకౌంటెంట్ మరియు ఆడిటర్ పోస్టుకు నెలకు రూ.5200-20200 ఉంటుంది. గ్రేడ్ పే రూ.2800గా ఉంటుంది. ఇక క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి నెలకు రూ.5200-రూ.20200గా ఉంటుంది. ఈ పోస్టుకు సంబంధించి గ్రేడ్ పే రూ.1900గా ఉంది. ఇక ఇంకెందుకు ఆలస్యం... అన్ని అర్హతలు ఉంటే వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+