Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IIM Bangalore: బెంగళూరు IIMలో కుల వివక్ష ఆందోళనలు.. డైరెక్టర్‌ని తొలగించాలంటూ నిరసనలు

Caste Discrimination: పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు వంటి విద్యాలయాలు చదువుకు, సంస్కారానికి నెలవుగా ఉండాలి. ఎందుకంటే భవిష్యత్ జనరేషన్స్‌ సరైన మార్గంలో నడవడం ఇక్కడి నుంచే నేర్చుకుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అంతకంతకూ పెరుగుతున్న ర్యాగింగ్, కుల మరియు మత వివక్షలు విద్యా సంస్థల స్ఫూర్తికే భంగం కలిగిస్తున్నాయి.

తాజాగా బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM-B)లో కుల వివక్ష ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంస్థ డైరెక్టర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఓ వర్గానికి చెందిన ఆందోళనకారులు నిరసన చేపట్టారు. SC, ST, OBC సామాజిక వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్స్ విధానాన్ని సంస్థ పాటించడం లేదని ఆరోపించారు. ఆయా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను IIM యాజమాన్యం ఖండించింది.

Caste Discrimination allegations on IIM Bangalore

బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద నిర్వహించిన ఈ నిరసనకు ఆల్ ఇండియా OBC స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA), డాక్టర్ BR అంబేద్కర్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ మరియు OBC ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చాయి. AIOBCSA దాఖలు చేసిన RTIని ఆధారంగా నిరసనకారులు ఆందోళనకు దిగారు. IIM-Bలో SC, ST మరియు OBC వర్గాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను గౌరవించాలని కోరారు.

SC, ST మరియు OBC సెల్స్ ఏర్పాటు చేయాలని నిరసనకారులు కోరారు. రిజర్వేషన్ విధానాన్ని ఉల్లంఘించినందుకు, ఈ వ్యవహారంపై ఆందోళనలను లేవనెత్తుతున్నారంటూ అధ్యాపకులను వేధించినందుకు IIM-B డైరెక్టర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే అందరికీ సమాన అవకాశలతో పాటు సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం, మంచి పని వాతావరణాన్ని పెంపొందించడానికి సంస్థ చాలా కాలంగా ప్రాధాన్యతనిస్తుందని IIMB ఓ ప్రకటనలో తెలిపింది.

ఫిర్యాదులను పరిష్కరించడానికి మరియు వివక్ష రహిత వాతావరణాన్ని నిర్ధారించడానికి డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ సెల్ మరియు ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. IIM-B కుల ఆధారిత వివక్ష లేదా వేధింపులను నివారించడానికి బలమైన వివక్ష వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని స్పష్టం చేసింది. సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ చట్టం 2019 ప్రకారం ఫ్యాకల్టీ స్థానాలకు రిజర్వేషన్‌లను అమలు చేసే ప్రక్రియలో ఉన్నట్లు వివరించింది. అయితే ఈ విషయంపై పాక్షికంగా విజయం సాధించామంటూ AIOBCSA తన X పోస్ట్‌లో చెప్పుకొచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+