సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష అడ్మిట్‌కార్డులు విడుద‌ల‌...

సీబీఎస్​ఈ 10, 12వ తరగతి అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష అడ్మిట్​ కార్డులు విడుద‌ల‌య్యాయి. సీబిఎస్ఈ ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 15వ తేది నుంచి 22వ తేదివ‌ర‌కు జ‌ర‌గ‌న‌నున్నాయి. అలాగే, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష జూలై 15, 2024న జరుగుతాయి. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రెండు తరగతులకు ఒకే షిఫ్టులో సీబీఎస్ఈ పరీక్షల‌ను నిర్వ‌హిస్తోంది. ప్రశ్నాపత్రం చ‌దివేందుకు విద్యార్థులకు క‌నీసం ప‌దిహేను నిమిషాల సమయం ఇవ్వ‌డం జ‌రుగుతుంది. తాజాగా, ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన అడ్మిట్‌కార్డుల‌ను సీబీఎస్ఈ విడుద‌ల చేసింది. ఈ పరీక్షల‌కు హాజరయ్యే అభ్యర్థులందరూ cbse.gov.in సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా త‌మ అడ్మిట్ కార్డుల‌ను డౌన్​లోడ్​ చేసుకోగ‌ల‌రు.

ఇక, ఈ ఏడాది సీబిఎస్ఈ 10, 12వ తరగతి వార్షిక ఫలితాలు మే 13.2024న విడుదల‌యిన సంగ‌తి తెలిసిందే. పదో తరగతిలో 93.06 శాతం ఉత్తీర్ణ‌త రాగా, 12వ తరగతిలో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది.12వ తరగతిలో మొత్తం 1,62,1224 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,42,6420 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతిలో మొత్తం 2251812 మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 2238827మంది ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యారు. ఇక‌, వీరిలో 2095467 మంది అభ్యర్థులు ఈ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్​ని సంద‌ర్శించవ‌చ్చు.

CBSE Class 10th 12th Supplementary Exam 2024 Admit Card Release

అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకునే విధానం..

అభ్య‌ర్థులు ముందుగా cbse.gov.in సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. హోమ్ పేజీలో ఉన్న లింక్​పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెంట‌నే ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులకు కంటిన్యూ లింక్ వస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అనంత‌రం పాఠశాలలపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆత‌ర్వాత‌ ఎగ్జామ్​ యాక్టివిటీస్​పై క్లిక్ చేయాలి. సీబీఎస్ఈ కంపార్ట్​మెంట్ అడ్మిట్ కార్డు 2024 లింక్ అందుబాటులో ఉంటుంది. వెంట‌నే ఆ లింక్​పై క్లిక్ చేసి లాగిన్ వివరాలు న‌మోదు చేయాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు స్క్రీన్​పై కనిపిస్తుంది. అడ్మిట్ కార్డు చెక్ చేసుకుని పేజీని డౌన్​లోడ్ చేసుకోవాలి. ఇక‌, ఈ అడ్మిట్ కార్డును భ‌విష్య‌త్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ లేదా ప్రింట్ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+