Budget announcement: బడ్జెట్‌లో ప్రకటనకు ప్రాణం పోసిన మోదీ సర్కార్.. నిన్నటి నుంచి కొత్త పథకం స్టార్ట్..
PM Internships: అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ క్రమంగా తన ప్రయారిటీలను మార్చుకుంటూ పోతోంది. విద్య మరియు నైపుణ్యాభివృద్ధిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల దృష్టి సారించింది. ఇందుకోసం తాజా బడ్జెట్‌లో పలు కీలక ప్రతిపాదనలు చేసింది. దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్న నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు వివిధ నిర్ణయాలు తీసుకుంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని కేంద్రం అక్టోబర్ 3న ప్రవేశపెట్టింది. అగ్రశ్రేణి కంపెనీల్లో 1.25 లక్షల ఇంటర్న్‌షిప్‌లను అందజేస్తున్నట్లు తెలిపింది. ఐదేళ్లలో మొత్తం కోటి ఇంటర్న్‌షిప్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) నిర్వహణలోని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం పైలట్ దశ కోసం 800 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. దీనిద్వారా యువ గ్రాడ్యుయేట్‌లను దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీలతో అనుసంధానించాలని ప్లాన్ చేసింది. ఆచరణాత్మక బిజినెస్ ప్రాక్టీసెస్, అకడమిక్ లెర్నింగ్ మరియు పరిశ్రమల అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఇది వీలు కల్పిస్తుందని కేంద్రం చెబుతోంది.
మహీంద్రా & మహీంద్రా, మాక్స్ లైఫ్ మరియు అలెంబిక్ ఫార్మా వంటి ప్రముఖ సంస్థలు ప్రస్తుతానికి 1,077 ఇంటర్న్‌షిప్ ఆఫర్‌లను అందించాయి. తద్వారా పలు కంపెనీలు బలమైన ప్రారంభ ఆసక్తిని కనబరిచాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు మరియు వైకల్యాలున్న వ్యక్తుల కోసం కేంద్ర రిజర్వేషన్ విధానం ఇంటర్న్‌షిప్‌లకు వర్తిస్తుందని MCA ప్రకటించింది. అభ్యర్థులు MCA పోర్టల్ pminternship.mca.gov.inలో అక్టోబర్ 12-25 మధ్య తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
ఎంపిక ప్రక్రియ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు కొనసాగుతుంది. నవంబర్ 8-15 మధ్య ఇంటర్న్‌షిప్ ఆఫర్ లెటర్‌లు పంపించబడతాయి. మొదటి బ్యాచ్ ఇంటర్న్‌లు డిసెంబర్ 2, 2024 నుంచి ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌లో కొనసాగుతారు. ఇంటర్న్‌లు నెలకు 5 వేలు ఆర్థిక సహాయంగా అందుకుంటారు. ప్రభుత్వం ద్వారా 4 వేల 500 మరియు పాల్గొనే కంపెనీలు వారి CSR నిధుల నుంచి 500 చొప్పున చెల్లిస్తాయి. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద అభ్యర్థులకు 6 వేలు వన్-టైమ్ గ్రాంట్ మరియు బీమా కవరేజీ కూడా లభిస్తుంది.
PM ఇంటర్న్‌షిప్ స్కీమ్‌కు అర్హత సాధించేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా 21-24 మధ్య వయస్సు కలిగి ఉండాలి. హై స్కూల్ లేదా హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్, ITI డిప్లొమా లేదా BA, BSc, BCom, BCA లేదా BBA వంటి గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్నా సరిపోతుంది. అయితే ఫుల్ టైమ్ కోర్సులు లేదా ఉద్యోగంలో చేరిన వారు అర్హులు కాదు. ఇక IITలు, IIMలు మరియు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల వంటి ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి గ్రాడ్యుయేట్లు కూడా మినహాయించబడ్డారు.












Click it and Unblock the Notifications