Coal Indiaలో ఉద్యోగాలు: ఈ మహారత్న కంపెనీలో లక్ష రూపాయలకు పైగా జీతం..అర్హతలు ఇవే..!!
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయాలనుకుంటున్నారా. అయితే అన్ని అర్హతలు ఉండి ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..అలాంటి వారికోసం కోల్ ఇండియా లిమిటెడ్ గుడ్‌న్యూస్ తెలిపింది. కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడదుల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 588 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ ప్రకటన ద్వారా వెల్లడించింది.
కోల్ ఇండియా విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన ద్వారా ఆ సంస్థ చేపట్టే మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలన్నీ పర్మినెంట్ ఉద్యోగాలుగా తెలుస్తోంది. కోల్ ఇండియాలో సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ఎంపికైన వారికి నెలకు రూ.50 వేల నుంచి రూ.1,60,000 వేల వరకు వేతనం చెల్లిస్తారు. అంతకంటే ముందు శిక్షణా సమయంలో రూ.50వేలు నెలకు చెల్లిస్తారు. ఒక ఏడాది పాటు శిక్షణ పొందిన తర్వాత ఓ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో పాసైన అభ్యర్థులను రెగ్యులరైజ్ చేసి వారికి నెలకు రూ.60వేల నుంచి రూ.1,80,000 వేతనంగా చెల్లిస్తారు.

కోల్ ఇండియా లిమిటెడ్‌లో పని చేసే మేనేజ్‌మెంట్ ట్రైనీలకు బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సులు కూడా పొందుతారు. అవి కింద విధంగా ఉన్నాయి.
* డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)
* హౌజ్ రెంటల్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ)
* కేఫ్టేరియా అలవెన్స్
* పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్‌పీ)- ఇది పనితీరు ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది.
ఇక మొత్తం 588 పోస్టులు భర్తీ చేయనుంది కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ. అయితే ఈ పోస్టులన్నీ ఆయా శాఖల్లో ఉన్నాయి. ఏయే శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..?
* మైనింగ్- 253
* ఎలక్ట్రికల్ -117
* మెకానికల్ -134
* సివిల్ - 57
* ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ - 15
* జియాలజీ - 12
విద్యార్హతలు:
విద్యార్హతల విషయానికొస్తే గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్)లో డిగ్రీ ఉండాలి. అయితే పైన తెలిపిన పోస్టుకు అనుగుణంగా ఆయా శాఖలో డిగ్రీ ఉండాలి. అంటే అభ్యర్థి మైనింగ్ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నట్లయితే మైనింగ్‌లో డిగ్రీ ఉండాలి. అలానే ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌కు అప్లయ్ చేస్తున్నట్లయితే ఎలక్ట్రికల్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. మెకానికల్‌కు మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, సివిల్‌కు సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అయితే ఆ శాఖలో డిగ్రీ, జియాలజీ అయితే జియాలజీలో ఎమ్మెస్సీ లేదా ఎంటెక్ చేసి ఉండాలి. జియోఫిజిక్స్ లేదా అప్లయ్డ్ జియోఫిజిక్స్ కూడా చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయొచ్చు.
అభ్యర్థుల వయస్సు విషయానికొస్తే 4 ఆగష్టు 2021 నాటికి 30 ఏళ్లు మించి ఉండరాదు. అయితే ప్రభుత్వ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు మూడేళ్లు మినహాయింపు ఉంటుండగా.. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.
ఇక కోల్‌ఇండియా లిమిటెడ్‌కు అప్లయ్ చేసుకునేవారు ముందుగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2021 పరీక్ష రాసి ఉండాలి. గేట్-2021 పరీక్షలో వచ్చిన స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ / ఓబీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా నాన్ రీఫండబుల్. ఇక ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు 10 ఆగష్టు 2021 నుంచి ప్రారంభం కాగా... దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పూర్తి చేసేందుకు చివరి తేదీ 9 సెప్టెంబర్ 2021. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి: www.coalindia.in












Click it and Unblock the Notifications